40 వేల కోసం ఇంటిని తాకట్టు పెట్టిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?

చిత్ర పరిశ్రమలో కమెడియన్లు హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వారు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు అన్న విషయం తెలిసిందే.ఇక నిర్మాణ రంగంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

 Comedian Padmanabham Unknown Facts Details, Comedian Padmanabham, Senior Ntr, Ac-TeluguStop.com

అయితే ఇలాంటి ట్రెండ్ ఇప్పటినుంచి కాదు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి కూడా ఉంది.అప్పట్లో ఎంతో మంది సినిమాల్లో స్టార్లుగా ఉన్నవారు నిర్మాణ రంగంలో కూడా రాణించారు.

అప్పట్లో కమెడియన్గా పద్మనాభం కి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ పద్మనాభం చేసే కామెడీ బాగా పండేది.ప్రేక్షకులు కూడా పద్మనాభం కామెడీ ని బాగా ఎంజాయ్ చేసేవారు.

కమెడియన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న పద్మనాభం అటు 1958 సంవత్సరంలో సహనటులు నరసింహారావు తో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో ఒక నాటక సంస్థను ఏర్పాటు చేశారు.ఇక ఆ తర్వాత ఇక అదే పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు కూడా చేశారట పద్మనాభం.

ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిన దేవత అనే సినిమాను కూడా నిర్మించారు పద్మనాభం.

అయితే ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారు పద్మనాభం.

Telugu Actress Savitri, Padmanabham, Devatha, Rao, Rekha Murali, Senior Ntr, Tol

రెండు నెలలు కష్టపడి కథ రాయడం ఈ కథను ఎన్టీఆర్కు వినిపించడం జరిగింది.ఎన్టీఆర్ కథ నచ్చడంతో ఆల్ ది బెస్ట్ బ్రదర్ అంటూ చెప్పేసాడు.అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సావిత్రి ని కూడా తీసుకోవాలని అనుకున్నారు.ఆమె దగ్గరికి వెళ్లి కథ చెప్పగా కథ నచ్చింది కానీ ఇప్పుడు తాను గర్భవతినని.

డెలివరీ అయినాక చేస్తాను అంటూ చెప్పిందట.కానీ పద్మనాభం పట్టుబట్టి మరీ మూడు నెలల్లో సినిమాని పూర్తి చేస్తానని ఒప్పించారట.

అయితే ఈ సినిమాకి తన బంధువైన రావును డైరెక్టర్ గా చేయడానికి 40 వేల రూపాయలు తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమాలు నిర్మించాడట పద్మనాభం.సినిమా సూపర్ హిట్ అయింది.

శత దినోత్సవం కూడా జరుపుకుంది.ఇక మొత్తంగా ఈ సినిమాలో 22 మంది తారలు కనిపిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube