సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎంతో క్రేజీగా ఉంటాయి.ఇలా ఆ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.
ఇలా క్రేజీ కాంబినేషన్ గా ఉన్న వారిలో విజయ్ దేవరకొండ సమంత జంట ఒకటి.వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు.
ఈ సినిమాలో వీరి పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు.ఇలా వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకొని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఖుషి సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి ఖుషి టైటిల్ అధికారకంగా ప్రకటించగానే సమంత విజయ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా టైటిల్ పై స్పందిస్తూ విజయ్ దేవరకొండ, సమంత సినిమాకు ఖుషి సినిమా టైటిల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోబోతున్నారు.పవన్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిన ఖుషి సినిమా ఒక క్లాసిక్ అని ఈ సినిమా టైటిల్ సమంత విజయ్ దేవరకొండ సినిమాకు పెట్టుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.అప్పట్లో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖుషి సినిమా చేయాలంటే మళ్లీ పవన్ కళ్యాణ్ చేయాలి లేదా ఆయన కొడుకు అకీరా నందన్ కి మాత్రమే చేసే అర్హత ఉంది అంతే కానీ ఇతరులు ఈ సినిమా టైటిల్ ను ఉపయోగించుకోవడం ఒప్పుకోమంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఈ విషయం పై ఫైర్ అవుతున్నారు.







