టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా గురించి మనందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నికీషా పటేల్ గురించి మనందరికి తెలిసిందే.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నికీషా పటేల్.
ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ హీరోయిన్ నికిషా పటేల్ మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.నికీషా పటేల్ ను అందరూ పవన్ కళ్యాణ్ హీరోయిన్ అని అంటుండడంతో ఆమె బాధ పడినట్లు తెలుస్తోంది.
ఆమె తనకున్న ట్యాగ్ లైన్ పట్ల ఎంతో బాధను వ్యక్తం చేసింది.ఇదిలా ఉంటే తాజాగా నికిషా పటేల్ తన అభిమానులతో చాట్ చేసింది.
ఇందులో భాగంగానే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఈ నేపథ్యంలోనే హీరో ప్రభాస్ గురించి చెప్పు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటూ నికిషా పటేల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
పవన్ కళ్యాణ్ గడ్డం లుక్ లో అద్భుతంగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది.అనంతరం హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ అని, ఎంతో హంబుల్ గా ఉంటాడు నాకంటే చాలా పొడుగ్గా ఉంటాడు అని తెలిపింది నికిషా పటేల్.

ఇంతలో మరొక నెటిజెన్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడగగా.అప్పుడు నికీషా చెప్పిన ఆన్సర్ తో ఆమె పెళ్లి విషయం గురించి బయటకు వచ్చింది.త్వరలోనే చేసుకుంటాను.పెళ్లి కొడుకు కూడా దొరికేశాడు.యూకే లో ఉంటున్నాడు అని తెలిపింది.నికీషా పటేల్ మాటలను బట్టి చూస్తే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని తెలుస్తోంది.
అంతే కాకుండా ఈమె ఒకానొక సమయంలో ప్రభుదేవాని పెళ్లి చేసుకోవాలను కుంది అని చేసిన కామెంట్స్ ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికీ తేలిసిందే.







