లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022 సీజన్ లో సెంచరీ చేశాడు.కేవలం 60 బంతుల్లో 103 పరుగులు చేసి వావ్ అనిపించాడు.
ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ పై తన రెండో సెంచరీని నమోదు చేశాడు రాహుల్.ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగి ఆడాడు.
శనివారం బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
కేఎల్ రాహుల్ తన కెరీర్‌లో 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు.
ప్రస్తుతం ఎల్‌ఎస్‌జీ టీమ్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో కేవలం 56 బంతుల్లో మూడవ సెంచరీని సాధించాడు.ఐపీఎల్ 2022లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు.
ఈ సెంచరీ సాధించిన తర్వాత ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ చెవులు, కళ్ళు మూసుకుని తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.ఇదేం వెరైటీ సెలబ్రేషన్స్ అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గత ఏడాది పుణెలో ఇంగ్లండ్‌పై వన్డే సెంచరీ సాధించిన తర్వాత కూడా రాహుల్ ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు.

“బయట వ్యక్తులు మాట్లాడే మాటలు పట్టించుకోకుండా మీ విజయాన్ని ఎంజాయ్ చేయండి.మీరు మీ పై నమ్మకం ఉంచండి.కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరిచడానికి నెగిటివ్ గా మాట్లాడుతారు.అలాంటి వారి మాటలు వినకండి.” అనే సందేశాన్ని అందరికీ తెలియజేసేందుకు ఇలా తాను కళ్లు, చెవులు మూసుకుంటానని గతంలో కె.ఎల్.రాహుల్ చెప్పాడు.అయితే ఇప్పటివరకూ ఇలా ఏ క్రికెటర్ కూడా తన సెంచరీలను ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు.
కేఎల్ రాహుల్ మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.







