మంత్రి గంగుల కమలాకర్ ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ బేటి..

మంత్రి గంగుల కమలాకర్ ఎఫ్.సి.

 Minister Gangula Kamalakar Met Fci Gm Deepak Sharma Over Yasangi Paddy Procureme-TeluguStop.com

ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ బేటి.యాసంగి ధాన్యం సీఎంఆర్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్.సి.ఐ సహకరించాలి.ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దు.గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపు పెంచాలి.ప్రతీ నెల 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలి.ధాన్యం సేకరణ పర్యవేక్షణకు ఎఫ్.సి.ఐ, సివిల్ సప్లైస్ నోడల్ అధికారులు.సమీక్షలో ఎఫ్.సి.ఐ ను కోరిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.ఇప్పటికే 34 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.

పక్క రాష్ట్రాల నుండి ఒక్క గింజ రాకుండా పకడ్బందీ చర్యలు.యాసంగి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం సర్వం సిద్దం.

యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బేటీ అయ్యారు, ఈ రోజు సివిల్ సప్లైస్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర పౌరసరఫరాల సంస్థ ఉన్నతోద్యోగులు పాల్గొన్నారు.

ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మకు తెలంగాణ ఈ యాసంగిలో చేయబోయే ధాన్యం సేకరణ వివరాల్ని వెల్లడించారు, యాసంగిలో తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు, నూక శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతుల శ్రేయస్సును ద్రుష్టిలో ఉంచుకొని అధనపు భారాన్ని భరించి ధాన్యం సేకరణ చేస్తున్నామని, సీఎంఆర్ సమయంలో అనవసర కొర్రీలు పెట్టి ఇబ్బందులు స్రుష్టించవద్దన్నారు.నాణ్యతా ప్రమాణాల మేరకు ముడి బియ్యం అందిస్తామని ఇందుకోసం లేఖల్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్.సి.ఐకు అందజేసామన్నారు.ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బ్రోకెన్ శాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఎఫ్.సి.ఐ ఎలాంటి అన్ రీజనబుల్ అబ్జెక్షన్స్ లేకుండా తీసుకోవాలని కోరారు.

Telugu Civil, Cm Kcr, Farmers, Fcigm, Telangana, Trs, Yasangi Paddy-Political

గత యాసంగిలో తీసుకోవాలస్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నులను ఫోర్టీఫైడ్ బాయిల్డ్ రూపంలో తీసుకోవాలని, గత వానాకాలం సీఎంఆర్ వేగంగా అందించే విదంగా ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాల్సిందిగా కోరారు, సీఎంఆర్ గడువులో తక్కువ ధాన్యం సేకరించే రాష్ట్రాలకు అధికంగా సేకరించే తెలంగాణకు ఒకే గడువు ఇస్తున్న అసమగ్ర విధానాన్ని సైతం పున:సమీక్షించాలని, అధనపు గడువును సైతం కేవలం నెలరోజులకు మాత్రమే ఇస్తున్న అంశాన్ని దీపక్ శర్మ ద్రుష్టికి తీసుకొచ్చి పరిష్కరించాల్సిందిగా కోరారు మంత్రి గంగుల కమలాకర్.35.80 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నులను సేకరిస్తున్నామని వీటికి 15కోట్ల గన్నీలు అవసరమని వీటి కోసం జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసామని వారు సప్లై చేయగా మిగిలనవి జెమ్ పోర్టల్తో పాటు బహిరంగ వేలం ద్వారా సేకరిస్తామన్నారు మంత్రి గంగుల.అలాగే యాసంగి సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడడానికి ఎఫ్.సి.ఐ నుండి డీజీఎం కమలాకర్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ నుండి జీఎం రాజిరెడ్డిలను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తామన్నారు మంత్రి గంగుల.

Telugu Civil, Cm Kcr, Farmers, Fcigm, Telangana, Trs, Yasangi Paddy-Political

అనంతరం సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాన్ని భరించి దేశంలో ఎక్కడాలేని విదంగా కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరణ చేస్తున్న నేపథ్యంతో పక్క రాష్ట్రాల నుండి ఒక్క వడ్ల గింజ మన కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చూడాలన్నారు.ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ఎలాంటి రీసైక్లింగ్ బియ్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకొని ఎక్కడి కక్కడ అధుపు చేయాలని, వాటిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. రైస్ మిల్లర్ల వద్ద ఉన్న సివిల్ సప్లైస్ శాఖ గన్నీలు త్వరగా సేకరించాలని ఆదేశించారు.

జిల్లాల్లో సివిల్ సప్లైస్ డీఎంలు, డీఎస్వోలు నిరంతర పర్యవేక్షణ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఎండలను తట్టుకునేలా నీడ సౌకర్యం ఏర్పాటు, మంచినీరు, అకాల వర్షాలు, గాలివానల నుండి రక్షణ చర్యలుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు అవసరమైన మేర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు నిన్నటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్.అనంతరం ధాన్యం సేకరణలో ఆర్థిక పరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామక్రుష్ణారావుతో బీఆర్కే భవన్లో బేటీ నిర్వహించారు, లోన్లపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ, గత బకాయిలు వంటి వాటిపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube