స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్క యుజర్ కూడా వాట్సాప్ యాప్ ను తప్పక వినియోస్తూ ఉంటారు.వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకట్టుకునే క్రమంలో సరికొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ వస్తుంది.
ఈ క్రమలోనే వాట్సాప్ మరిన్ని సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తుంది ఎప్పటికప్పుడు.ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్ కు సంబంధించి అదిరిపోయే ఫీచర్లను ప్రకటించింది.
మరి ఆ ఫిచర్స్ ఏంటో ఒకసారి చూద్దామా.ఒకే గ్రూప్ లోని మెంబెర్స్ ను కాకుండా వేర్వేరు గ్రూప్స్ లోని మెంబర్స్ ను ఒకే చోట కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా కమ్యూనిటీస్ ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.
వీటితో పాటు గ్రూప్స్ కోసం అడ్మిన్ డిలీట్, లార్జ్ వాయిస్ కాల్స్, లార్జ్ ఫైల్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్లు అనే మరొక నాలుగు కొత్త ఫీచర్లను కూడా మనకు పరిచయం చేయబోతుంది.మరి ఆ ఫీచర్లు ఎలా యూజర్లకు ఉపయోగపడతాయో చూద్దామా.
కొత్తగా రాబోయే వాట్సాప్ కమ్యూనిటీస్ ఫీచర్ సాయంతో యూజర్లు మొత్తం కమ్యూనిటీకి పంపిన అప్‌డేట్లను రిసీవ్ చేసుకోవడంతో పాటు వచ్చిన అప్‌డేట్ల పై స్మాల్ డిస్కషన్ గ్రూప్స్ ఆర్గనైజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.అంటే ఈ ఫీచర్ ద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ అనేదే రాదు.
టైమ్ కూడా సేవ్ అవుతుంది.అలాగే కొత్తగా వచ్చిన వాట్సాప్ గ్రూప్ ఫీచర్లు విషయానికి వస్తే.
గ్రూప్ లో యూజర్లు తమ అభిప్రాయాలను త్వరగా పంచుకోవడానికి వాట్సాప్ ఎమోజీ రియాక్షన్లను తీసుకొస్తోంది.

అలాగే అడ్మిన్ డిలీట్ అనే కొత్త ఫీచర్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి చాట్ నుంచి వివాదాస్పద, ఇబ్బందికర, అసత్యకరమైన మెసేజెస్ లను డిలీట్ చేయడానికి అనుమతిస్తుంది.అయితే వీటిని డిలీట్ చేసే అధికారం గ్రూప్ అడ్మిన్ కు ఉంటుంది.వాటిని అడ్మిన్ ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు.
అలాగే ఇకమీదట వాట్సాప్ యూజర్లు తమ ఫైల్ షేరింగ్ లిమిట్ ను కూడా పెంచుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తుంది.అలాగే మరొక ఫీచర్ ఏంటంటే.
ఇప్పటివరకు వాట్సాప్ లో 4 నుంచి 8 మంది మెంబర్లు మాత్రమే గ్రూప్ కాల్స్ చేసుకునేందుకు అనుమతి ఉంది.కానీ.
, ఇప్పుడు వాట్సాప్ ఒకేసారి 32 మంది మెంబర్లు వాయిస్ కాల్స్ చేసేందుకు అవకాశం ఇస్తుంది.ఈ ఫీచర్లు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని వాట్సాప్ వెల్లడించింది.







