ఘనంగా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా ‘హు ఆర్ యు?’ చిత్రం ప్రారంభం

సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు మూవీ ఫేమ్) హీరోహీరోయిన్లుగా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌పై వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం ‘హు ఆర్ యు?’ (Who Are You?).సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నేడు (శుక్రవారం) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి.ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ కొట్టగా.లలిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

 The Film Opens With The Suspense Crime Family Drama Who Are You , Suspense Cr-TeluguStop.com

రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి నిర్మాత బొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ.‘‘మా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌లో రెండో చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.

ప్రియా నాయుడు మంచి కథని అందించారు.మంచి టీమ్ కుదిరింది.

అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది.రెగ్యులర్ షూటింగ్‌ కూడా నేటి నుండే ప్రారంభమవుతుంది.

ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నాము.మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము.

’’ అని తెలిపారు.

దర్శకుడు వైకుంఠ్ బోణు మాట్లాడుతూ.

‘‘సస్పెన్స్ క్రైమ్ జానర్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.ఈ సినిమా వాటికి విభిన్నంగా ఉంటుంది.

ఖచ్చితంగా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఈ మూవీ ఎంటర్‌టైన్ చేస్తుంది.నిర్మాత, టీమ్ మంచి సపోర్ట్ అందిస్తున్నారు.

సురేష్ సపవత్, సత్నా టైటస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇతర ముఖ్యపాత్రలలో నటించేవారి వివరాలను త్వరలోనే తెలియజేస్తాము.

’’ అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube