ప్రభాస్ ఫ్లాప్ అవుతుంది అనుకున్న ఆ సినిమా.. సూపర్ హిట్ అయింది మీకు తెలుసా?

దర్శక నిర్మాతలు హీరోలు హీరోయిన్లు ఎంతో కష్టపడి సినిమా చేస్తూ ఉంటారు.ఇంకా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఉంటారు.

 Prabhas Expectations Goes Wrong With Mr Perfect Movie ,mr Perfect , Prabhas , Di-TeluguStop.com

కానీ ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఎవ్వరూ ఊహించలేరు.ఎందుకంటే దర్శకనిర్మాతలు సినిమా హిట్ అవుతుందని సినిమా చేస్తారు.

కానీ ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులు అని చెప్పాలి.ఇలా కొన్ని కొన్ని సార్లు ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమాలు హిట్ అవ్వడం సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమాలు డిజాస్టర్ గా నిలవడం ఎన్నో సినిమాల విషయంలో జరిగింది.

అయితే కొంతమంది నిర్మాతలు తీసే సినిమాలు మాత్రం తప్పకుండా హిట్ అవుతాయని నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది.అలాంటి వారిలో దిల్రాజు కూడా ఒకరు.దిల్ రాజు కి ఇప్పటివరకు 85 శాతం సక్సెస్ రేటు ఉంది.విభిన్నమైన కథలను మాత్రమే ఆయన నిర్వహిస్తూ ఉంటారు.

దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.ఆ తర్వాత మరోసారి అదే బ్యానర్ లో ప్రభాస్ హీరోగా దశరధ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత డిఫరెంట్ గా ఉంటుంది ఇక ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ తాప్సి హీరోయిన్లుగా నటించారు.సినిమా షూటింగ్ పూర్తయింది.

ఎడిటింగ్ కూడా జరిగింది.అయితే ఎడిటింగ్ రూమ్లో సినిమాను చూసిన ప్రభాస్ ఏదో తేడా కొడుతుంది చెప్పారట.

Telugu Dil Raju, Kajal Agrawal, Mrperfect, Prabhas, Praksah Raj, Radhya Shyam, T

ఈ క్రమంలోనే ప్రభాస్ సలహా మేరకు కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేయించారట.హీరో కాజల్ కు స్వీట్ తినిపిస్తున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఉన్న సీన్లను తాప్సీ తో తీసేశారట.అయితే కాజల్ తో తీస్తే బాగుంటుందని ప్రభాస్ స్నేహితులు సూచించడంతో అలాగే ఆ తర్వాత రిషూట్ చేశారట.అయినప్పటికీ ఈ సినిమా హిట్అవుతుంది అని ప్రభాస్ నమ్మకం పెట్టుకో లేదట.

ఇక ఆ తర్వాత విడుదలైన ఈ క్లాసికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో ప్రభాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube