సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పోలీస్ స్టోరీ కథాంశంతో తెరకెక్కిన సినిమాకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.అయితే పోలీస్ స్టోరీ కథాంశంతో తెరకెక్కిన కథలకు ఎంత క్రేజ్ ఉంటుందో అచ్చం ఇలాగే అటు నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన చిత్రాలకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.
జనాలను ఇలాంటి సినిమాలు బాగా ఆకర్షిస్తూ ఉంటాయి.ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఆచార్య చేసారు.
ఈ సినిమా మరికొన్ని రోజులు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇలా నక్సలిజం నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సినిమాల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించాయని విషయం తెలిసిందే.ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆచార్య :
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా లో కీలక పాత్రలో నటించాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించాడు.కాగా గతంలో మెగాస్టార్ చిరంజీవి నక్సలిజం నేపథ్యంలో రక్తసింధూరం అనే సినిమాలో నటించారు అన్న విషయం తెలిసిందే.

విరాట పర్వం :
దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నక్సల్ బ్యాక్ డ్రాప్ మూవీ విరాటపర్వం.ఇక ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది.ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది కూడా క్లారిటీ లేదు అని చెప్పాలి.

జల్సా :
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన జల్సా సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక ఈ సినిమాలో కామ్రేడ్ పాత్రలో కనిపిస్తాడు పవన్ కళ్యాణ్.
విరోధి :
శ్రీకాంత్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక జర్నలిస్టు గా కనిపిస్తాడు శ్రీకాంత్.ఈ సినిమా పూర్తిగా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది అని చెప్పాలి.

సింధూరం :
నక్సల్ బ్యాక్గ్రౌండ్ సినిమా కు ఈ సినిమా పెట్టింది పేరు.ఈ సినిమా ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే కథాంశం.చిన్న సినిమాగా వచ్చి అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది సింధూరం సినిమా.రవితేజ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఎర్రసైన్యం :
నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన ఎర్రసైన్యం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక అప్పట్లో యువత రక్తం ఉడికించింది ఈ సినిమా.
యువతరం కదిలింది :
మురళీమోహన్ హీరోగా ధవళ సత్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది అని చెప్పాలి.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఒసేయ్ రాములమ్మ :
దొరల కాళ్ళకింద అణగారిన బ్రతుకులు బతుకుతున్న వారు తిరగబడితే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వచ్చింది.ఎలాంటి హీరో లేకుండా విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.







