ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది.అయితే దానిని వెలికితీసి సరైన సమయంలో ఉపయోగిస్తే అద్భుతాలను సైతం సృష్టిస్తారు అనడానికి ఈ బాలిక ఒక ఉదాహరణ అనే చెప్పాలి.
ప్రతిభకు వయసుతో పని లేదని ఈ 14 ఏళ్ల బాలిక నిరూపించి చూపించింది.పెద్దలు సైతం నివ్వేరపోయేలాగా ఏకంగా మనం జ్వరం తగ్గడానికి ఉపయోగించే డోలో మాత్రపై భారత్ చిత్ర పటాన్ని గీసి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది.
తనలోని అద్భుతమైన ప్రతిభకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
వివరాల్లోకి వెళితే.కేరళలోని కాసరగోడ్ జిల్లాకు చెందిన భవ్య అనే 14 సంవత్సరాల బాలిక వయసుతో సంబంధం లేకుండా అరుదైన ఘనతను సాధించింది.1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న చిన్న డోలో మాత్రపై భారత చిత్రపటాన్ని గీసి అందరిని ఆశ్చర్య పరిచింది.భవ్య ఇలాంటి చిత్ర పటాలు చాలానే గీసింది.భారత క్రికెటర్ సచిన్ తెందూల్కర్, మలయాళ నటుడు మమ్ముటీ చిత్రపటాలను బాటిల్స్ పై చిత్రికరించి ఔరా అనిపించింది.కరోనా లాక్ డౌన్ సమయం చిత్రపటాలను గియడానికి ఉపయోగించుకున్నట్లు ఈ బాలిక తెలిపింది.లాక్ డౌన్ సమయంలో సుమారు 65కు పైగా వివిధ రకాలైన చిత్రాలను బాటిల్స్‌పై చిత్రించినట్లు తెలిపింది.

ఈ బాలిక ఆలోచనలు ఎంత గొప్పవి అంటే.తన పాకెట్ మనీ అవసరాల కోసం తల్లితండ్రుల మీద ఆధారపడకుండా ఖాళీ సమయంలో కేకులు తయారు చేసి వాటిని అమ్ముతూ కొంత డబ్బును సంపాదిస్తొంది.తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలిక తన ఎనిమిది సంవత్సరం నుంచే భరతనాట్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలను కూడా ఇచ్చింది.అలాగే మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
కాగా భవ్య ప్రతిభను వెలికితీసి తనకు పూర్తి సహకారం అందించడంలో ఈ చిన్నారి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది అని అంటోంది ఈ చిన్నారి.







