మెగా హీరోలలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది.అయితే మెగా ఫ్యామిలీ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయని తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి.
వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేకపోయినా చాలామంది ఈ వార్తలను జరుగుతున్న ప్రచారం వల్ల నిజమేనని నమ్ముతున్నారు.అయితే చాలా సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రచారానికి సంబంధించి చరణ్ ఘాటుగా బదులివ్వగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నాయక్ ఆడియో ఫంక్షన్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాబాయ్ ఆడియో ఫంక్షన్ కు హాజరై ఫంక్షన్ లో డాడీ లేని లోటును తీర్చారని డాడీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబాయ్ అని డాడీ టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలో డాడీ వెనుక పవర్ ఫుల్ ఫోర్స్ లా కళ్యాణ్ బాబాయ్ ఉండేవారని చరణ్ వీడియోలో చెప్పుకొచ్చారు.డాడీకి ఏది ఎదురొచ్చిన మొదట అన్నయ్యతో కాదు నాతో మాట్లాడు అంటూ ఆరాను కళ్యాణ్ బాబాయ్ క్రియేట్ చేశారని చరణ్ తెలిపారు.
కళ్యాణ్ బాబాయ్ ఎవరికీ సమాధానం చెప్పే అవసరం లేదని బాబాయ్ ను ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడాలని రామ్ చరణ్ పేర్కొన్నారు.

ఈ ఆడియోకు బాబాయ్ వచ్చారని నాకు, అభిమానులకు చాలా ఆనందంగా ఉందని చరణ్ చెప్పుకొచ్చారు.రచ్చ ఫంక్షన్ కు బాబాయ్ రాకపోతే ఏదో రాశారని ఈ వేదికపై మా ఫ్యామిలీ అంతా కలిసి కనిపిస్తే మాత్రమే మేము కలిసి ఉన్నట్టా? అని చరణ్ ప్రశ్నించారు.

మా ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో నాకు తెలుసని చరణ్ పేర్కొన్నారు.నా తర్వాత సినిమా ఆడియోకు బాబాయ్ రాకపోవచ్చని అందుకు బోలెడు కారణాలు ఉంటాయని అది రీజన్ గా తీసుకుని మీడియాలో రాయడం తప్పని చరణ్ వెల్లడించారు.రాసినా నాకు వెంట్రుక అని చరణ్ కామెంట్లు చేశారు.
చరణ్ ఓల్డ్ వీడియోను చూసిన నెటిజన్లు బాబాయ్ పై చరణ్ కు ఇంత ప్రేమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.







