గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన.తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండ గ్రామంలో పర్యటించిన నారా లోకేష్.
ఇంటింటికి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్.నారా లోకేష్ కామెంట్స్.
పీల్చే గాలి తప్ప అన్నింటి పైనా జే ట్యాక్స్.త్వరలో పీల్చే గాలిపై కూడా పన్ను వేస్తారేమో జగన్ రెడ్డి.
ప్రమాణస్వీకారం రోజు విద్యుత్ ధరలు తగ్గించేస్తా అని హామీ సీఎం హామీ ఇచ్చారు.మాట తప్పి 7 సార్లు విద్యుత్ ధరలు పెంచారు.
అందుకే ఆయన జగన్ మోసపు రెడ్డి.బాదుడే బాదుడు అంటూ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి తెచ్చారు.
వైసిపి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలతో బిల్లులు మే 10 లోపు ప్రజలందరికి అందుతాయి.ఈ లోపు పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలి.
లేకపోతే మే 10 తరువాత మంత్రుల ఇళ్ళు, అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం.విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీలు రెండు సార్లు, నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి పన్ను, చెత్త పన్ను ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నారు.నిరుద్యోగులకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఒక్క ఉద్యోగం భర్తీ చెయ్యలేదు.
ఆయన బంధువులకు రూ.3 లక్షల జీతంతో సలహాదారుల ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? మంత్రులంతా డమ్మీలే…ఒక్కో మంత్రి చుట్టూ సొంత సామాజిక వర్గానికి చెందిన నలుగురు సలహదారులను నియమించారు.వాళ్ళు ఎక్కడ సంతకం చెయ్యమంటే అక్కడ మంత్రులు సంతకాలు పెట్టాలి.కాళ్ళు మొక్కే బానిసలనే మంత్రులుగా నియమించుకున్నారు.భజన చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారు.ఉప కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు.
ఎన్ని నిధులు ఇచ్చారు.ఎవరి జీవితాలు మారాయి? సామాజిక న్యాయం అంటున్న సీఎం చర్చకు సిద్ధమా? బడుగు, బలహీన వర్గాల వారి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.అమ్మ ఒడి లాంటి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు చూపించి సామాజిక న్యాయం అంటే ఎలా?
పేదల ఉపాధి కోసం ఒక్క రూపాయి కేటాయించకుండా మంత్రి పదవులు ఇచ్చాం అంటే సరిపోతుందా? పవర్ హాలిడే వలన పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి.లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
బెదిరింపులు, పవర్ హాలిడే తో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.పెంచిన విద్యుత్ ధరలు తగ్గించి, 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చే వరకూ బాదుడే బాదుడు పేరుతో చేస్తున్న పోరాటం ఆగదు.
సీఎం కి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది అందుకే పీకుడు భాష మాట్లాడుతున్నారు.చెత్త మీద కూడా పన్నేసి ఆయన ప్రజల వెంట్రుకలు అన్ని పీకేస్తున్నాడు.
త్వరలో పీల్చే గాలి పై కూడా పన్నేసినా ఆశ్చర్యం లేదు.







