ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కి కొత్త మంత్రివర్గంలో చోటు రాలేదని ఆమె రాజీనామా చేసినట్లు వార్తలు రావడం తెలిసిందే.పైగా మూడు రోజులపాటు మీడియాకి ఎవరి కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పరిస్థితి ఇలా ఉంటే నేడు క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ తో ఆమె దాదాపు గంటన్నరకు పైగా భేటీ కావడం జరిగింది.అనంతరం మీడియాతో మాట్లాడిన సుచరిత.
.తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల పై సీరియస్ అయ్యారు.పదవి దక్కకపోవడం వల్ల కొద్దిగా ఎమోషన్ అయ్యాను.అన్న మాట వాస్తవమే కానీ రాజీనామా.చేసినట్లు వార్తలు రావడం బాధాకరమని తెలిపారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా థాంక్స్ గివింగ్ లెటర్ రాయడం జరిగిందని.
దానిని తన కుమార్తె తప్పుగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు.చెప్పటం జరిగింది.
చిన్న పొరపాటు జరిగినది.తప్పుగా బయటకు వెళ్లిందని క్లారిటీ ఇచ్చారు.
రాజీనామా అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదని తెలిపారు.రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసిపి పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పుకొచ్చారు.
తనని ఎప్పుడూ సీఎం జగన్ చెల్లెలు భావిస్తారని వైఎస్ కుటుంబంలో వ్యక్తిగా పరిగణిస్తారని ఆమె స్పష్టం చేశారు.గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంది.
ఇంకా రెండు రోజుల పాటు బయటకు రాకూడదు అని అనుకున్నాను కానీ రాజీనామా అనే వార్తలు మరింత వైరల్ అవుతున్న తరుణంలో… స్పష్టత ఇవ్వాలని అని బయటకు వచ్చాను జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని సుచరిత మీడియా ముందు స్పష్టం చేశారు.







