న్యూయార్క్ : ఎడిసన్ పబ్లిక్ లైబ్రరీకి విరాళంగా వందలాది భారతీయ పుస్తకాలు...!!

భారతదేశానికి సంబంధించి వందలాది పుస్తకాలను అందించినందుకు గాను న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ – ఎడిసన్ చాప్టర్ (జీవోపీఐవో- ఎడిసన్)లకు ఎడిసన్ పబ్లిక్ లైబ్రరీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.ఎడిసన్ దాని సమీప ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో భారత సంతతి కుటుంబాలు నివసిస్తున్న సంగతి తెలిసిందే.

 Hundreds Of Books On India Donated To Edison Public Library , Edison Public Libr-TeluguStop.com

ఏప్రిల్ 10న జరిగిన ఇండియన్ కలెక్షన్ లాంచ్’ఈవెంట్‌కు దాదాపు 120 మంది హాజరయ్యారు.ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ 140 పుస్తకాలను జీవోపీఐవో, గుజరాతీ సాహిత్య అకాడమీ, అస్సాం సాహిత్య సభ, జాకీర్ హుస్సేన్ సర్కిల్‌లు 110 పుస్తకాలను అందించాయి.

గుజరాతీ లిటరరీ అకాడమీ ఛైర్మన్‌గా వున్న జీవోపీఐవో వైస్ ప్రెసిడెంట్ రామ్ గాదవి విరాళంగా ఇచ్చిన 60 గుజరాతీ పుస్తకాలు కూడా ఈ కలెక్షన్స్‌లో వున్నాయి.

Telugu Books, Edisonpublic, Indian Launch, Jaiswal, York, Telugu Nris-Telugu NRI

కమ్యూనిటీ వ్యవహారాల కాన్సుల్‌ ఎ.కె.విజయకృష్ణన్ సహా ఇండియన్ కమ్యూనిటీ నాయకులు, ఎడిసన్ సమీప నగరాల నుండి ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు, భారతీయ-అమెరికన్‌లు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారితో పాటు ఇటీవల మృతిచెందిన జీవోపీఐవో సభ్యుడు యష్ పాల్ సోయి సంస్మరణార్ధం నిమిషం పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ జైస్వాల్ మాట్లాడుతూ.

అమెరికాలోని వైబ్రెంట్ లైబ్రరీ సిస్టమ్‌పై ప్రసంగించారు.భారతీయ పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో వుండటం వల్ల ప్రవాసులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లైబ్రరీ డైరెక్టర్ అలన్ క్లీమాన్ మాట్లాడుతూ… పుస్తకాల సేకరణ పట్ల సంతోషంగా వుందన్నారు. లైబ్రరీ సిబ్బందిలో చాలా మంది భారతీయ మూలాలున్న వారు వున్నారని చెప్పారు.

వీరంతా 5 నుంచి 6 భారతీయ భాషలను మాట్లాడుతారని అలన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube