గత తొమ్మిది సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులందరినీ సందడి చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది కమెడియన్స్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా లేడీ కంటెస్టెంట్ జబర్దస్త్ వర్ష మరో కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి చేసే స్కిట్ లకు ఎంతో మంచి క్రేజ్ వచ్చింది.ఇక సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా గత రెండు మూడు వారాల నుంచి జబర్దస్త్ కార్య క్రమంలో కనిపించకపోవడంతో ఈమెకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు.
అందరూ అనుకున్న విధంగానే రోజాకు మంత్రి పదవి రావడంతో ఇక ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
ఇలా ఈమె ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం ఈమెకు ఒక వైపు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు జబర్దస్త్ నుంచి ఈమె వెళ్ళిపోతుంటే ఎంతో ఎమోషనల్ అయ్యారు.మొత్తానికి మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రోజా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వీడ్కోలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ వర్ష తన సోషల్ మీడియా వేదికగా రోజాతో కలిసి ఉన్నటువంటి వీడియోని షేర్ చేస్తూ. ఐ యాం సో హ్యాపీ బట్ ఐ మిస్ యూ అమ్మా అంటూ రోజాని హగ్ చేసుకుంటూ ఎమోషనల్ అయిన వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక జబర్దస్త్ నుంచి రోజా వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ఇంద్రజ కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి.







