ముఖ్యమంత్రి కేసీఆర్ నీ సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హైదరాబాద్ ప్రగతి భవన్ లో కలిశారు.సత్తుపల్లి నియోజకవర్గంలో పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకుగాను పలు అభివృద్ధి, సంక్షేమ, సుందరీకరణ పనులు కోసం గ్రామాలకు,మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్య మంత్రి కేసీఆర్ నీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కేసీఆర్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తదితర మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు.







