రవితేజ, సుధీర్ వర్మ 'రావణాసుర' చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి..

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రావణాసుర` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

 Raviteja Sudheer Varma Ravanasura Movie Huge Action Schedule Completed Details,-TeluguStop.com

ఈ షెడ్యుల్ లో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.సినిమాలో ఇది కీలకమైన షెడ్యూల్.

దీంతో చిత్రీకరణకు సంబధించి మూడు షెడ్యూల్లా షూటింగ్ పూర్తయింది.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

రవితేజ లాయర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇప్పటికే విడుదలైన వీరిద్దరి ఫస్ట్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లకు ప్రాధాన్యత వుంది.అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.దర్శకుడు సుధీర్ వర్మ, మాస్ మహారాజా రవితేజని ఈ చిత్రంలో సరికొత్తగా చూపించబోతున్నారు.

Telugu Abhishek Nama, Schedule, Anu Emmanuel, Sudheer Varma, Raviteja, Ravanasur

ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ ద్వయం సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

తారాగణం:

రవితేజ, సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: సుధీర్ వర్మ, నిర్మాత: అభిషేక్ నామా, బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, మ్యూజిక్: హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్, డీఓపీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్‌కే కిరణ్, సీఈఓ: పోతిని వాసు, మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు, పీఆర్వో : వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube