చైతన్య సమంత విడాకులు వాళ్లిద్దరి అభిమానులతో పాటు సాధారణ అభిమానులకు కూడా భారీ షాకిచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే సమంత ఈ మధ్య కాలంలో మజిలీ సినిమా పోస్టర్ ను షేర్ చేయడంతో పాటు అక్కినేని అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో చైసామ్ మళ్లీ కలవడం సాధ్యమేనని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే చైసామ్ విడిపోయిన సమయంలో వాళ్లిద్దరి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ప్రముఖ నటుడు కౌశిక్ తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ చైసామ్ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను చేసిన సీరియల్స్ లో ప్రియాంక సీరియల్ అంటే ఎంతో ఇష్టమని కౌశిక్ అన్నారు.ట్రాన్స్ జెండర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చిన్న చూపు ఉందని కౌశిక్ పేర్కొన్నారు.
నేను చిరంజీవితో నటించాలని భావిస్తున్నానని స్టాలిన్ సినిమాలో చిన్న పాత్ర చేశానని ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలని తనకు ఉందని కౌశిక్ వెల్లడించారు.
పబ్లిక్ లో ఇండస్ట్రీ అంటే చిన్నచూపు ఉందని అది తనకు నచ్చదని కౌశిక్ తెలిపారు.

బిగ్ బాస్ 4లో ఛాన్స్ వచ్చినా తాను వెళ్లలేదని నా లైఫ్ ను పబ్లిక్ చేయడం ఇష్టం లేదని కౌశిక్ వెల్లడించారు.చైతన్య సమంత డివోర్స్ తీసుకుంటే దానిపై డిబేట్ ఎందుకు చేస్తున్నారని అది వాళ్ల పర్సనల్ ఇష్యూ అని కౌశిక్ అన్నారు.ఒకళ్లేదో జాతకం అంటారని వాళ్ల పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ చేయవద్దని కౌశిక్ పేర్కొన్నారు.

వేరేవాళ్ల జీవితంలో తొంగిచూడటం కరెక్ట్ కాదని ఆయన కామెంట్లు చేశారు.ఇండస్ట్రీలో మనిషిగా బాధ అనిపించిందని చైతన్య సమంతల స్పేస్ వాళ్లకు ఇవ్వాలని కౌశిక్ పేర్కొన్నారు.ఇండస్ట్రీ వాళ్లకు అద్దెకు ఇవ్వరని లోన్లు కూడా ఇవ్వరని మంచి చెప్పినా ఎవరూ చూడరని కౌశిక్ చెప్పుకొచ్చారు.







