ప్రియమణి 2003లో “ఎవరే అతగాడు” సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు.
తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో ఆయనకు జోడీగా నటించింది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగు ఇండస్ట్రీలో ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది.
తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ప్రియమణి ఎన్నో సినిమాలలో నటించింది.ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకుంది.
సాధారణంగా ప్రస్తుత కాలంలో అందరు సోషల్ మీడియా ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.సెలబ్రిటీలు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో హీరోయిన్లను పొగుడుతూ నచ్చనీ వారిని దారుణంగా విమర్శిస్తూ ఉంటారు.ప్రియమణి కూడా ఇలా ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.
డ్రెస్సింగ్, శరీరాకృతి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు.

ఇటీవల ప్రియమణి ఈ విమర్శల మీద స్పందిస్తూ.”చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ఉంటారు.కొన్ని సందర్భాలలో ఆ మీమ్స్ చూసి నవ్వుకునే దాన్ని.
కానీ కొందరు మాత్రం వారి ఇష్టానుసారంగా హద్దులు దాటి మరి విమర్శలు చేస్తుంటారు.అలాంటి వారిని నేను వెంటనే బ్లాక్ చేస్తాను.
అభిమానులు నన్ను ఇష్టపడకపోయినా , ఇష్టపడిన కూడా నేను నాలాగే ఉంటా.సోషల్ మీడియా నా జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ అదే జీవితం కాదు” అంటూ ప్రియమణి చెప్పుకొచ్చారు.








