అలియా భట్ వెడ్డింగ్ గురించి ఫ్యాన్ పోస్ట్.. డెడ్ అంటూ హీరోయిన్ పోస్ట్!

సాధారణంగా అభిమానులు వారి అభిమాన హీరో, హీరోయిన్ల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే వారికి నచ్చిన సెలబ్రిటీలు కనిపించారు అంటే వాళ్లతో కలిసి సెల్ఫీలు దిగాలని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

 Alia Bhatt Funny Response To Fan Post On Her Wedding Details, Alia Bhatt, Bolly-TeluguStop.com

ఇంకొంత మంది సెలబ్రిటీలు అయితే హీరో, హీరోయిన్లకు వేరే వాళ్ళతో పెళ్లి అవుతున్నప్పుడు అది చూసి తట్టుకోలేక పోతారు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్ల విషయంలో అయితే చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పలు రకాల పోస్ట్ లు పెడుతూ ఉంటారు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రణ్‌బీర్  కపూర్ లు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం అందరికి తెలిసిందే.

ఇక ఈ నెల 14వ తేదీన ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.దీనితో అలియా భట్ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక నిజం అయితే ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ ల పెళ్లి జరగటం తట్టుకోలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అంతేకాకుండా ఆ పోస్ట్ లో అతడు ఒక కారును వెంబడిస్తూ పరుగులు తీస్తున్నాడు.

అతను పరుగులు తీస్తున్న ఆ కారు వెనకాల ఆలియా వెడ్స్ రణ్‌బీర్  అని రాసి ఉంది.దీంతో సదరు నెటిజన్ కారును వెంబడిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అయితే ఆ వీడియో కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ కియారా వెళ్లిపోతుంటే, షాహిద్ రోడ్డుపై పరిగెత్తినట్టు గా కనిపించింది.అంతేకాకుండా ఆలియాభట్ పక్కనే తన ఫోటో ఉన్నట్టు షేర్ చేయడమే కాకుండా ఆ తరువాత తన స్థానంలో రణ్‌బీర్  ఉన్నట్లు కూడా ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోను చూసిన ఆలియాభట్ స్పందిస్తూ డెడ్ అంటూ కామెంట్ చేసి పోస్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube