దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.పోయిన నెల 25 తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలోవిడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.అయితే ఈ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ వచ్చే మార్చిలో మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు.
పోటీ ఏంటని అందరికీ ఆశ్చర్యంగా ఉందా? అవునండి వీరిద్దరూ వారి వారి సినిమాలతో థియేటర్ల వద్ద పోటీ పడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు.
ఎన్టీఆర్ 30 అనే సినిమా తొందరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.కోటాల శివ ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని మాత్రం అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.ఈ సినిమాలో ఎన్టిఆర్ కి జోడీగా అలియా భట్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో కైరా అద్వానీ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది.రామ్ చరణ్ సినిమా ను శంకర్ అత్యధిక బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.ఈ సినిమా మార్చిలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా మార్చిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా కలిసి విజయం అందుకున్న వీరిద్దరూ వచ్చే మార్చిలో మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు.







