ఎంతో సాధించాలనుకున్నాడు.. చివరికిలా, కెనడాలో మరణించిన కార్తీక్ కుటుంబం ఆవేదన

కెనడాలోని టోరంటోలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్ధి మరణించిన సంగతి తెలిసిందే.జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి, కుటుంబానికి ఆసరాగా వుంటాడనుకున్న కొడుకు.

 Kartik Vasudev Dreamt Of Going To Canada To Pursue Higher Education But Fate Had-TeluguStop.com

కానరానీ లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వాళ్లని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

ఉన్నత విద్యను అభ్యసించి డిజిటల్ మార్కెటింగ్‌లో పనిచేయాలనే లక్ష్యంతో మూడు నెలల క్రితమే తమ బిడ్డ కెనడాకు వెళ్లాడని.కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్తీక్ గురువారం తను పనిచేసే రెస్టారెంట్‌కు వెళ్తుండగా టోరంటో నగరంలోని సబ్ వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.తీవ్ర గాయాలతో పడివున్న కార్తీక్‌కు ఓ పారా మెడిక్ ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అక్కడ చికిత్స పొందుతుండగానే ప్రాణాలు కోల్పోయినట్లు టోరంటో పోలీసులు వెల్లడించారు.

కార్తీక్ తండ్రి జితేష్ వాసుదేవ్.

తల్లి పూజా.తమ బిడ్డ కెనడా వెళ్లాలని ఎంతగా శ్రమించింది వారు గుర్తుచేసుకున్నారు.

పదవ తరగతిలో వున్నప్పుడే కెనడా వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పారు.ఈ క్రమంలోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు కార్తీక్ ఈ ఏడాది జనవరి 4న కెనడాకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు.

టొరంటోలోని సెనెకా కాలేజీలో చేరిన కార్తీక్.ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరవుతున్నాడు.

10, 12 తరగతులు, గ్రాడ్యుయేషన్‌లో కార్తీక్ మంచి మార్కులు సాధించాడని అతని తండ్రి జితేష్ వాసుదేవ్ తెలిపారు.గతేడాది డిసెంబర్‌లోనే కెనడా వెళ్లాల్సి వుందని.

విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడని, కానీ వీసా దొరకకపోవడంతో వీలు కాలేదని జితేష్ చెప్పారు.కొన్ని రోజుల తర్వాత వీసా రావడంతో మరోసారి ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని .జనవరి 4న కెనడాకు బయల్దేరాడని ఆయన గుర్తుచేసుకున్నారు.

Telugu Canada, Jitesh Vasudev, Kartik Vasudev, Kartikvasudev, Subwayentrance-Tel

తమది మధ్యతరగతి కుటుంబమని.అయితే తాను మంచి ఉద్యోగం సంపాదిస్తానని కార్తీక్ తరచుగా చెప్పేవాడని జితేష్ వెల్లడించారు.కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల నేపథ్యంలో చదువుకుంటూనే, పార్ట్‌టైమ్ జాబ్ చేస్తానని కార్తీక్ చెప్పాడని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలోనే బురిటోస్ (కెనడాలోని మెక్సికన్ రెస్టారెంట్)లో పనిచేస్తున్నాడని జితేష్ చెప్పారు.కార్తీక్ వుంటున్న ఇంటి నుంచి గంటన్నర ప్రయాణించి ప్రతిరోజూ రెస్టారెంట్‌కు చేరుకునేవాడని ఆయన పేర్కొన్నారు.

కేవలం 15 రోజుల క్రితమే అక్కడ పనిలో చేరాడని.మొదటి జీతంతో ఐఫోన్ కొనుక్కోవాలని అనుకున్నాడని జితేష్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube