అక్కడ మహిళల చేతిలో పెట్రోలు పంపు.. ధరల పెరుగుదలపై వారేమంటున్నారంటే..

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక ప్రత్యేకమైన పెట్రోల్ బంక్ ఉంది.దీనిని పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు.

 Kolkata Ladies Petrol Pump , Kolkata Ladies , Petrol Pump , Lockdown , Cab Char-TeluguStop.com

ఇక్కడ వారు రోజంతా వాహనాల్లో పెట్రోలు నింపాక.ఇంటికి వెళ్లి కుటుంబ వ్యవహారాలు చూసుకుంటారు.

వీరు పెరుగుతున్న చమురు ధరలపై ప్రజల ప్రతిస్పందనను రోజూ వింటుంటారు.ఈ పెట్రోలు పంప్‌లో పనిచేసే మహిళలు మీడియాతో తమ సమస్యలను వెళ్లగక్కారు.

చాలీచాలని జీతంతో ఇల్లు నడపడం కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.లాక్‌డౌన్‌కు ముందు ఉన్న జీతం ఇప్పుడు అందడం లేదని బంక్‌లో పనిచేస్తున్న మహిళలు తెలిపారు.

తమ ఖర్చులు, ఉద్యోగ బాధ్యతలు పెరుగుతున్నా దాని ప్రకారం జీతం మాత్రం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.జీతం పెంచుతామని అంటున్నారని, కానీ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఎన్నో అవస్థలు పడ్డామన్నారు.గతంలో రూ.24 ఉన్న క్యాబ్ ఛార్జీ ఇప్పుడు రూ.40కి చేరిందని అన్ని వేళల్లో బస్సుల్లో రాలేమని వాపోయారు.ఆలస్యమైతే ఆటోలో రావాలని, ఆటో ఛార్జీ 30 రూపాయలవుతుందని, బస్సు అయితే 15 రూపాయలు చెల్లించాల్సివస్తుందన్నారు.ఇది భారంగా మారిందన్నారు.ద్రవ్యోల్బణం ప్రకారం జీతం కూడా పెరగాలంటున్నారు.ప్రతిరోజూ చమురు ధరలపై ప్రజల ఆగ్రహాన్ని చూస్తున్నమన్నారు.

తమ భర్తలకు తగినంత సంపాదన లేదని అందుకే తాము ఇక్కడ పనిచేస్తున్నామన్నారు.ఇద్దరి జీతంతో కుటుంబం నడుస్తున్నదన్నారు.

ఇక్కడ పనిచేసే మహిళలు అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు.చాలీచాలని జీతాలతో పిల్లలను చదివిస్తూ ఇంటిని నడపాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని సమస్యల మధ్య కాలం గడుపుతున్నా.వారి ముఖంలో చెరగని చిరునవ్వు కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube