జగన్ ఆవేశం వెనుక అసలు కారణాలేంటి ?

వైసీపీ పై టిడిపి ,జనసేన పార్టీ లు ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా,  ఎప్పుడు జగన్ రియాక్ట్ అయ్యేవారు కాదు.కొంతమంది వైసీపీ మంత్రులు,  ఎమ్మెల్యేలు జగన్ పై వచ్చిన విమర్శలను తిప్పి కొడుతూ , రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ ఉండేవారు.

 Jagan Sensational Comments On Chandrababu Pavan Kalyan, Ap Cm Jagan, Ap Governme-TeluguStop.com

ఏ విషయంలోను జగన్ స్పందించినట్టుగానే వ్యవహరిస్తూ ఉండేవారు.  అయితే గత కొద్దిరోజులుగా చూసుకుంటే జగన్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది.

టిడిపి జనసేన పార్టీలతో పాటు , ఆ పార్టీల అనుకూల మీడియా పైన ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.  శాపనార్థాలు పెడుతూ.

ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.తాను ఎప్పుడూ జనం కోసమే ఆలోచిస్తున్నాను అని,  జనం కోసమే పని చేస్తున్నాను అని, జనమే తన బలం అంటూ జగన్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు.

తాజాగా నంద్యాల లో వసతి దీవెన పతకం ద్వారా సొమ్ములు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన జగన్ ఈ సందర్భంగా. జనసేన, టీడీపీ, ఆ పార్టీల అనుకూల మీడియా పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తూ.చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని , నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
   దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చానని,  వీళ్ళు అందరు కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ జగన్ అన్నారు.

జగన్ వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.ఆయన లో అసహనం కట్టలు తెంచుకుంది అని , అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈ తరహ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ మొదలైంది.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీ ఓట్లు చీలకుండా చూస్తామంటూ మాట్లాడిన దగ్గర నుంచి జగన్ వైఖరిలో మార్పు వచ్చిందని, అందుకే ఈ స్థాయిలో అసహనానికి గురవుతూ.సభలు,  సమావేశాలు నిర్వహిస్తూ ఆ సభలోనే ఈ తరహ ఘాటు విమర్శలకు పదును పెడుతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenani, Nandyala, Ysrcp-Telugu Political N

ప్రస్తుతం ఏపీ లో చోటుచేసుకున్న కొన్ని కొన్ని పరిణామాలు జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నాయి ముఖ్యంగా విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపుదల, ఇలా ఎన్నో అంశాలలో వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం పెరుగుతుంది.ఇదే ఇంటెలిజెన్స్ నివేదికల రూపంలోనూ ఎప్పటికప్పుడు జగన్ కు సమాచారం చేరుతుండటంతో జగన్ కు ఈ స్థాయిలో ఆగ్రహాన్ని కలిగిస్తున్న గా కనిపిస్తోంది.     

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube