ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.రాజకీయంగా స్పీడ్ పెంచేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న, క్షేత్రస్థాయిలో బిజెపి ప్రజాదరణ పొందలేకపోతోంది.
ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్లతో సరిపెట్టుకుంది. ఒంటరిగా పోటీ చేసినా, బిజెపి ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అర్థం పడుతుంది.ప్రస్తుతం జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.కానీ టిడిపి వ్యవహారము ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.ఎన్నికల సమయంలో పవన్ టిడిపి తో జత కడితే తమ పరిస్థితి ఏమిటని టెన్షన్ బీజేపీని వేధిస్తోంది.
దీంతో సొంతంగా బలం పెంచుకునే విషయం పై ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది.నేడు ఉత్తరాంధ్రలో పోరుబాట చేపట్టనుంది.
ఉత్తరాంధ్ర లో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ తో బిజెపి ఈరోజు పోరుబాట మొదలుపెడుతుంది.
మొత్తం మూడు రోజుల పాటు ఈ పోరుబాటను చేపట్టనున్నారు.మొత్తంగా 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తయ్యే సాగు తాగు నీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ బీజేపీ ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమయ్యే జన పోరు యాత్ర విశాఖలో మూడో రోజుల్లో ముగియనుంది.

ఈ యాత్రలోనే అక్కడక్కడ భారీ బహిరంగ సభలను బిజెపి ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర బీజేపీ కీలక నాయకులను ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు.ఉత్తరాంధ్రలో సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు తాము ఇదేవిధంగా యాత్రలు చేపడతామని బిజెప ఏపీ నాయకులు ప్రకటించారు.
ఎన్నికల వరకు ఇదే ఈ విధంగా ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.







