నర్సీపట్నం లో గత రెండు రోజులుగా అధిక మొత్తంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయకపోవడం అర్ధరాత్రి 11 గంటల సమయంలో కరెంటు పోవడం తో కృష్ణదేవిపేట నుండి వచ్చిన ఒక గర్భిణీ కి అదే సమయంలో డెలివరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది.
అప్పటికప్పుడు ఆమె బంధువులకు భర్తకు అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కనీసం కొవ్వొత్తులు కానీ చార్జింగ్ లైట్లు తెమ్మని చెప్పడంతో ఆ సమయంలో ఊరు గాని ఊరు లో అర్థంకాని అయోమయ స్థితిలో పడ్డారు.అప్పుడు అక్కడే ఉన్న వారి సెల్ఫోన్ లైట్ల సహాయంతో డెలివరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది.
అక్కడే ప్రసూతి విభాగంలో ఉన్న చంటి బిడ్డ తల్లి , అప్పుడే పుట్టిన పిల్లలు కరెంటు లేక దోమలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు.







