బుధవారం సాయంత్రం 5గంటలకు మొగల్రాజపురంలోని లోని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, Ex.MLA బొండా ఉమామహేశ్వర రావు గారి విలేకర్ల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ జగన్ అధికారంలో వచ్చాక రాష్ట్రాన్ని అవినీతి ఆంద్రప్రదేశ్ గా మార్చారు అన్నారు. వైసీపీ ప్రభుత్వం లిక్కర్ మాఫియా,ఇసుక మాఫియా,మైనింగ్ మాఫియాగా మారింది అన్నారు.
అనేక సార్లు వైసీపీ అవినీతి పై టిడిపి ఆధారాలు బయట పెట్టైన అధికారులు పట్టించు కోవట్లేదు అన్నారు.ముఖ్యమంత్రి అవినీతి బాటలోనే నడుస్తూ స్థానిక సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫుడ్ కోర్టులో 50 లక్షల అవినీతికి పాల్పడ్డాడు అని మండిపడ్డారు.88 మంది చిరు వ్యాపారులకు గత టిడిపి ప్రభుత్వం ఫుడ్ కోర్టు లో వ్యాపారానికి అవకాశం ఇచ్చింది.రాత్రి 10 నుండి 2 వరకు ఫుడ్ కోర్టు లు ఉండేవి.
అలాంటి ఫుడ్ కోర్టు ను వైసిపి ప్రభుత్వం వచ్చాక కమిషన్లు కోసం కక్రుత్తి పడ్డారు మల్లాది విష్ణు.రోజులు గడుస్తున్నా వ్యాపారులు బండి పెట్టె పరిస్థితి లేదు… ఒక్కో బండికి నాలుగు లక్షలు డిమాండ్ చేస్తున్నారు అన్నారు.
దీనికి మల్లాది విష్ణు సమాధానం చెప్పాలి అని, ప్రభుత్వం స్పందించాలని అన్నారు.పోలీసులు, కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని దయ్యబట్టారు.కార్పొరేషన్ లో కొత్త మున్సిపల్ అధికారి వచ్చారు అని, ఆయన దృష్టికి ఈ విషయాన్నీ తీసుకువెళతాం అన్నారు.మల్లాది విష్ణు విజయవాడలో అన్ని రంగాలను లూటీ చేస్తున్నారు అని, కాంట్రాక్టర్లు దగ్గర మల్లాది కమిషన్లు కొట్టేస్తున్నారు అని, మూడు సంవత్సరాలలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు కానీ ఇలాంటి లంచాలు దడుకోవడంలో mla ముందున్నది అన్నారు.
ఎమ్మెల్యే తో పాటు ఆయన ఇద్దరు సోదరులు కూడా ఈ అవినీతి చేస్తున్నారు అన్నారు.ఆదివారం వరకు సమయం ఇస్తున్నాం అని, అప్పటి వరకు ఎవరు స్పందించకుంటే చిరు వ్యాపారులకి అండగా మేము ఉంది వారితో మేమె కొట్టులు పెట్టిస్తాం.
మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం అని తెలిపారు.
ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు, నేతలు దాసరి జయరాజు, ఘంటా కృష్ణ మోహన్, మాచెర్ల గోపి తదితరులు పాల్గొన్నారు.








