మన దేశంలో ఎన్నో రకాల కళలు ఉన్నాయి.ఒక్కో మనిషిలో ఒక్కో కళ దాగి ఉంటుంది అంటారు మన పెద్దలు.
ఆ మాటకు అర్ధం ఏంటి అనేది ఈ యువ ఇంజనీర్ ను చూస్తే గాని అర్ధం అవ్వదు.మనకు పనికిరావు అని అనుకునే పాడైపోయిన వ్యర్థాలతో పలు రకాల అద్భుతాలను సృష్టిస్తున్నాడు ఈ యువ ఇంజనీర్.
పనికిరాని వ్యర్థాలతో వివిధ రకాల కళాకృతులను నిర్మించి వాటికి సరికొత్త రూపాన్ని ఇస్తున్నాడు.ఇండస్ట్రీకు, మెకానిక్ షెడ్స్, గ్యారేజీల నుంచి పనికి రాని లోహపు వ్యర్థాలను తీసుకువచ్చి విభిన్న ఆకృతులను నిర్మిస్తున్నాడు.
మరి ఆ యువ ఇంజనీర్ ఎవరు ఏంటి అనే వివరాలు చూద్దామా.
ఇతని పేరు దేవల్‌వర్మ.
ఇతను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వాసిలో నివసిస్తూ ఉంటాడు.దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా కూడా సాధించాడు.
దేవల్‌కు లోహాల వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకోవాలనే ఆలోచన కలిగింది.అనుకున్నదే తడవుగా దానినే ఓ వృత్తిగా ఎంచుకునీ పరిశ్రమలు, ఆటో గ్యారేజీల నుంచి పనికిరాని వస్తువులను సేకరించడం మెుదలుపెట్టాడు.
అలా వాటికి వివిధ రకాలైన ఆకృతులకు రూపం కల్పించాడు.దాదాపు 8 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాడు దేవల్ వర్మ.
ఇలా వేస్ట్ గా పడేసిన వ్యర్థలను సేకరించి వాటిని అందంగా తీర్చిదిద్దడం దేవల్‌కు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పవచ్చు.
ఇప్పటివరకు దాదాపు 6వేల కిలోలకు పైగా లోహపు వ్యర్థాలకు అందమైన రూపాన్ని అందించినట్లు దేవల్ తెలిపాడు.

ఇటీవలె ఖర్‌గోన్ పురపాలక సంస్థకు… భారతదేశ చిత్రపటాన్ని.దేవల్ రూపొందించి ఇచ్చాడు.దానికి “సోనే కీ చిడియా” అనే పేరును కూడా పెట్టడం జరిగింది.అంతేకాకుండా ఇనుము, ఉక్కుతోపాటు వివిధ రకాల లోహాలతో కలిపి 12 అడుగుల ఎత్తైన ఏనుగును తయారు చేశాడు దేవల్.
ఈ ఏనుగు బొమ్మ ఇండోర్ నగరంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దేవల్ తయారు చేసిన కళాకృతులను 5 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు.అలాగే భారత్ లోను పలు పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేవల్ తెలిపాడు.

ఈ క్రమంలో దేవల్ ఇలా చెప్పుకోచ్చాడు.లోహపు వ్యర్థాల నుంచి మేము ఆకృతులను తయారు చేస్తున్నాం.ఈ వ్యర్థాలను పరిశ్రమలు, గ్యారేజీల నుంచి సేకరిస్తున్నాం.
ఈ వ్యర్థాల నుంచి వివిధ రకాలైన కళాకృతులను మేము రూపొందిస్తున్నాం అని తెలిపాడు.మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో పరిశ్రమలు అభివృద్ధి చెంది మనదేశం కోల్పోయిన గుర్తింపు తిరిగి వస్తుందని నేను విశ్వసిస్తున్నానని దేవల్ వర్మ తెలిపాడు.







