జనసేన సమావేశం నేడే ! ఆ విధంగా ముందుకు వెళ్తారా ? 

రాజకీయంగా జనసేన పార్టీ స్పీడ్ పెంచింది.ప్రజా ఉద్యమాలు , ఆందోళనలు తరచుగా చేపడుతూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది.

 Janasena Is Going To Hold A Crucial Meeting Today , Janasena Party , Pavan Kalya-TeluguStop.com

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉండడంతో జనసేన అలర్ట్ అవుతోంది.క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశంపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు.

దీనిలో భాగంగానే ఈ రోజు జనసేన లోని పూర్తి కార్యవర్గంతో సమావేశానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.జనసేన పార్టీలో ఉన్న అన్ని వ్యవస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయి.

ఈ సందర్భంగా పొత్తుల వ్యవహారం పై ఈ సమావేశంలో చర్చించి , అందరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు.

ఎన్నికలకు ఏవిధంగా సిద్ధమవ్వాలి ? పొత్తుల వ్యవహారం లో పార్టీ నాయకుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుసుకోనున్నారు.ప్రస్తుతం ఏపీలో విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి నెలకొంది.ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచము అని జగన్ ప్రకటించినా, వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం, , అన్ని పెరుగుతున్నాయి దాంతోపాటే విద్యుత్ చార్జీలు పెరిగాయి అంటూ వైసిపి నాయకులు అధికారులు చెప్పడం, వీటన్నిటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జనసేన సిద్ధమవుతోంది.

ఈ రోజు నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తిస్థాయిలో క్లారిటీ తెచ్చుకోబోతున్నారు.ఇక విద్యుత్ చార్జీలు అంశంతో పాటు , ప్రజా సమస్యల విషయంలో అలర్ట్ గా ఉంటూ ఎక్కడికక్కడ స్థానికంగా నిరసన కార్యక్రమాలకు జనసేన శ్రీకారం చుట్టబోతుంది.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan-Telugu Political News

అయితే పార్టీ నిర్వహించే కార్యక్రమాలు హైలెట్ కావాలన్నా, జనసేన లోనూ ఉత్సాహం పెరగాలన్నా తప్పనిసరిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలి.ఇక ఎన్నికల వరకు నిరంతరంగా ప్రజల్లోనే ఉంటూ,  ప్రజా బలం పెంచుకునే విషయంపైనే పవన్ దృష్టి సారించాలి.అయితే తీరికలేని సినిమా షెడ్యూల్ కారణంగా పవన్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండలేని పరిస్థితి.దీంతో పార్టీ శ్రేణులు మాత్రమే ఈ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube