అమెరికాలో అంగరంగ వైభవంగా సిలికానాంధ్రా ఉగాది వేడుకలు...!!!

తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ, తెలుగు సంవత్సరాది ఉగాది ని అమెరికాలోని తెలుగు ఎన్నారైలు ఎంతో వైభవంగా జరుపుకున్నారు.

అమెరికాలో ఎంతో మంది తెలుగు వారు వివిధ ప్రాంతాలలో, రాష్ట్రాలలో నివసిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచీ లక్షలాది మంది అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా సరే మన తెలుగు సాంప్రదాయాలని, సంస్కృతిని, పండుగలను క్రమం తప్పకుండా జరుపుకుంటూ అగ్ర రాజ్యంలో తెలుగు దనం ఉట్టిపడేలా చేస్తున్నారు.ముఖ్యంగా అమెరికాలో ఉండే తెలుగు వారి పిల్లలకు తెలుగు బాషను నేర్పేందుకు గాను అలాగే తెలుగు బాషాభివ్రుద్ది కి ఎంతగానో కృషి చేస్తున్న సిలికానాంధ్రా తెలుగు సంఘం తెలుగు పండుగలను ప్రత్యేక తీరిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది.

ఈ క్రమంలోనే ఉగాది పర్వదినం పురస్కరించుకుని కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో ఉగాది వేడుకలను నిర్వహించారు.భారత్ నుంచీ వేప పువ్వులను తెప్పించి మరీ ఉగాది పచ్చడి చేసి ఈ వేడుకలో ఆహుతులకు అందించారు.

ప్రాంతీయ తెలుగు కవుల స్వీయ కవితా పటనం తో కార్యక్రమం ప్రారంభించారు. శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి పాటలను ఎంచుకుని తెలుగు వారి పిల్లలతో పాడించి అందరిని ఆశ్చర్య పరిచారు.

Advertisement

ఆహుతులను అలరించేలా ఆదుర్దా వద్దు ఆనందం ముద్దు అనే నాటకాన్ని ప్రదర్శించి అందరిని నవ్వించారు.ఈ వేడుకలకు ముందుగానే పిల్లలకు బాషా వికాస పోటీలను నిర్వహించి వారికి ఈ వేడుకల రోజున బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ కాన్సులేట్ జనరల్ ముఖ్య అతిదిగా విచ్చేశారు.సిలికానాంధ్రా ఏళ్ళ తరబడి తెలుగు బాషాభివ్రుద్ది కి దేశం కాని దేశంలో చేస్తున్న కృషికి అలాగే తెలుగు సంస్కృతిని తెలుగు వారి పిల్లలకు తెలియజేసేవిధంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలని చూసి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు