మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమా ద్వారా కోటేశ్వరరావు కమెడియన్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.తాజాగా కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సొంతూరు మచిలీపట్నం అని 2002లో హైదరాబాద్ కు వచ్చానని అన్నారు.
లైఫ్ లో పెద్ద పాప చనిపోవడం విషాదకర ఘటన అని ఆయన వెల్లడించారు.అది నరకం అని వర్ణించడానికి వీలు కాదని ఆయన అన్నారు.
నేను చిన్న ఆపరేషన్ చేయించుకున్నానని కదలకూడదని నా భార్య కంటి ఆపరేషన్ చేయించుకుందని తను ఏడవకూడదని ఆ సమయంలో పెద్ద పాప చనిపోయిందంటూ కమెడియన్ ఎమోషనల్ అయ్యారు.నా భార్య ఆ సమయంలో అత్తగారింట్లో ఉన్నారని అక్కడ మున్సిపాలిటీ బావి ఉండేదని కూతురు ఆ బావిలోని నీళ్లను తోడుతూ మెట్లపై పోస్తోందని ఆ చెంబు బావిలో జారిపోవడంతో కూతురు ఆ చెంబును బయటకు తీయడానికి ప్రయత్నించి బావిలో పడిపోయిందని కమెడియన్ కోటేశ్వరరావు చెప్పుకొచ్చారు.
ఆరోజు ఆదివారం రోజని దుర్గ ఎక్కడ దుర్గ ఎక్కడ అని వెతికామని అయితే పాప ఎక్కడా కనబడలేదని కమెడియన్ కోటేశ్వరరావు వెల్లడించారు.

1990లో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో వర్షాలు కురిసి బావి నిండిందని మామయ్య అనుమానంతో బావిలో చూడగా శవం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.నేను రేపు అనేదాని గురించి ఆలోచించకపోవడానికి కారణమిదే అని ఆయన వెల్లడించారు.
తాను కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు చేశానని అయితే గుర్తింపు రాలేదని ఆయన వెల్లడించారు.కొత్తజంట సినిమాను మొదట సంపూర్ణేష్ బాబుతో షూట్ చేశారని ఆ తర్వాత సినిమాలో మార్పులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.
కొందరు సినీ ప్రముఖులు తనకు రెమ్యునరేషన్లు ఇవ్వని సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.







