కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ రష్మిక మందన.టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇప్పటివరకూ ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలుస్తుండటంతో, ఆమెకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.దాంతో స్టార్ హీరోల పక్కన కూడా నటించే అవకాశాలను ఇట్టే కొట్టేస్తోంది ఈ భామ.దాని ఫలితమే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి భారీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది రష్మిక.ఇక ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనూ మంచి మార్కులు తెచ్చుకొని, కెరీర్‌లో దూసుకుపోతోంది.
ఇప్పటికే నేషనల్ క్రష్‌గా తనకంటూ అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌పైనా కన్నేసినట్టు తెలుస్తోంది.అయితే మొన్నటి వరకూ ఆమె ఓ హిందీ సినిమాలో నటించబోతుందంటూ ప్రచారం జరిగినా, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
తాజాగా ఆ కాస్త ప్రకటనా వెలువడడంతో ఆమె అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.కాగా రష్మిక, బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా గీతాంజలి అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ అధికారిక ప్రకనట ఇచ్చారు.మరి ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే యానిమల్ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇకపోతే ప్రస్తుతం రష్మిక మందన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది.







