కొనేది ఎట్లా..బతికేది ఎట్లా:- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పైర్

సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా, బతికేది ఎట్లా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ గ్యాస్, టోల్ చార్జీలు ధరలు పెంచి ప్రజలపై భారం మోపి నడ్డివిరిస్తుంటే సీఎం కేసీఆర్ కరెంటు చార్జీలు పెంచి ప్రజల ను బాదుతున్నాడని దుయ్యబట్టారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ శనివారం చింతకాని మండలం నాగులవంచ గ్రామం నుంచి బోనకల్ మండలం ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, చిరునోముల గ్రామాల్లో కొనసాగింది.

 How Much Was Bought..how Much Was Left: - Clp Leader Bhatti Vikramarka Pier-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.సామాన్య పేద ప్రజలపై భారం మోపుతున్న పాలకులు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు పంచిపెడుతున్నారని విమర్శించారు.

పంచవర్ష ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టులు, మిశ్రమ ఆర్థిక విధానాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఫలాల ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు నేడు వాటిని ప్రజలకు దూరం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు మోడీ సర్కార్ దారాదత్తం చేస్తున్నదని ధ్వజ మెత్తారు.

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందని వివరించారు.ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు.

దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం మరో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.నెలకు రూ.5వేలు రావాల్సిన కరెంట్ బిల్లు రూ.96 వేలు బిల్లు వేస్తే కట్టడం సాధ్యమేనా? ప్రజలపై ఇలా కరెంటు చార్జీల భారం మోపితే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.సంపద ఉన్న రాష్ట్రంలో ప్రజలపై పన్నుల భారం మోపడం కరెక్ట్ కాదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube