కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బీస్ట్.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ లను విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.ఇకపోతే ఉగాది పండుగ సందర్భంగా నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది.ఇలా ఈ సినిమా విడుదల కాకుండానే ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్ అరబిక్ కుత్తూ’ సాంగ్ ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే.సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుత్తూ పాట మరో ఘనతను సాధించింది. ఈ పాట 250 మిలియన్ల వ్యూస్‌ను సాధించి సౌత్‌లో ఫాస్ట్‌గా 250 మిలియన్ల వ్యూస్ సాధించిన పాటగా రికార్డులు సృష్టించింది.సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుధ్ సంగీతం అందించారు.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13న ఐదు భాషల్లో విడుదల కానుంది.







