తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్ విషయంలోనూ పంతం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు.
గవర్నర్ కార్యాలయం లో జరిగే కార్యక్రమాల నిమిత్తం కెసిఆర్ కు ఆహ్వానాలు పంపిస్తున్నా, ఆయన దూరం పాటిస్తూ వస్తున్నారు.తాజాగా గవర్నర్ కార్యాలయం ఉగాది వేడుకలను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపించారు.
దీంతో అంతా కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరు అవుతారని భావించారు.కానీ ఆయన మాత్రం హాజరు కాలేదు.చివరి క్షణం వరకు కేసీఆర్ రాక కోసం ఎదురు చూసిన గవర్నర్ ఆ వేడుకలను నిర్వహించారు.కెసిఆర్ మాత్రమే కాకుండా, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆహ్వానాలు అందినా వారిలో చాలామంది ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
హాజరైతే కెసిఆర్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే భయము వారిలో ఉంది.కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వంటి వారే.
ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.దీంతో ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు మరింతగా దూరం పెరిగిందనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల ఫ్లెక్సీలలోను కేసీఆర్ ఫోటో కనిపించలేదు.అయితే తమిళనాడు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ విషయంలో కేసీఆర్ పంతం పట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి.a

హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయం పంపించిన ఫైలును గవర్నర్ తమిళ సై వెనక్కి పంపించడం వంటివి కెసిఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి ఇక అప్పటి నుంచి రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య దూరం అలా పెరుగుతూనే వస్తోంది.








