వేస‌విలో గ‌ర్భిణీలు ఖ‌చ్చితంగా తినాల్సిన పండు ఇదే!

ఈసారి వేస‌వి కాలం కాస్త ముందుగానే వ‌చ్చింది.ఎండ‌ల తీవ్ర‌త రోజురోజుకు పెరిగిపోతోంది.

 This Is Definitely A Fruit That Pregnant Women Should Eat In Summer ,  Pregnant-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో ఆరోగ్యపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని వైద్య నిపుణులు సూచ‌న‌లు చేస్తున్నారు.ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు అనేక‌ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

అయితే వేస‌విలో గ‌ర్భిణీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అటువంటి వాటిలో కర్బూజ‌ ఒక‌టి.

ఈ పండు తినేందుకు రుచిగా ఉండ‌ట‌మే కాదు.విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌తో పాటు మ‌రెన్నో పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటుంది.

అందుకే క‌ర్బూజ పండు ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు వేస‌వి కాలంలో క‌ర్బూజ‌ను ఖ‌చ్చితంగా తినాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే, వేసవి కాలంలో అధిక చెమటల కారణంగా గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్ బారిన ప‌డుతుంటారు.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో క‌ర్బూజ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

కర్బూజ పండులో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది.అందువ‌ల్ల రోజుకు ఒక క‌ప్పు క‌ర్బూజ ముక్క‌లు లేదా క‌ర్బూజ జ్యూస్‌ను తీసుకుంటే శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

Telugu Fruit, Kharbooja, Latest, Pregnant, Tips-Telugu Health Tips

వేస‌వి వేడి వ‌ల్ల హీటెక్కిన శ‌రీరాన్ని కర్బూజ క్ష‌ణాల్లోనే కూల్‌గా మార్చ‌గ‌ల‌దు.అలాగే వేస‌విలో చాలా మంది గ‌ర్భిణీలు అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతుంటారు.అలాంటి వ‌రు క‌ర్బూజ‌ను డైట్‌లో చేర్చుకుంటే..బీపీ కంట్రోల్‌లోకి వ‌స్తుంది.మండే ఎండ‌ల వ‌ల్ల గ‌ర్భిణీలు ఇట్టే నీర‌స ప‌డిపోతుంటారు.

తీవ్ర అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను త‌రిమి కొట్ట‌డంలో క‌ర్బూజ ఓ మెడిసిన్‌లా పనిస్తుంది.

అవును, క‌ర్బూజ పండును త‌ర‌చూ తీసుకుంటే గ‌నుక ఎలాంటి నీర‌స‌మైనా, అల‌స‌టైనా ప‌రార్ అవ్వ‌డం ఖాయం.అంతేకాదండోయ్‌.క‌ర్బూజ‌ను తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.గ‌ర్భిణీల్లో జుట్టు రాల‌డం త‌గ్గుముకం ప‌డుతుంది.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ సైతం చురుగ్గా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube