ఉగాది రోజున ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఆఫర్..కేవలం వీరికి మాత్రమే..!

తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉగాది పండగ సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఆఫర్ ను తీసుకుని వచ్చింది.ప్రయాణికులకు చేరువయ్యే దిశగా తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్స్ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ ఉంటుంది.

 Tsrtc Ugadi Offer Free Travel For Senior Citizens Details, Ugadi, Special Offer-TeluguStop.com

సీజన్లకు తగ్గట్లుగా స్పెషల్ బస్సులను ఏర్పాట్లు చేస్తూ, ప్రతి పండక్కి ఏదో ఒక ఆఫర్ తో ప్రయాణికులకు చేరువ అవుతూ వస్తుంది.మార్చి 8న ఉమెన్స్ డే రోజున ఆడవాళ్లకు ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది.

అలాగే ఇప్పుడు కూడా ఉగాది పండగ సందర్బంగా మరొక సరికొత్త ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది తెలంగాణ ఆర్టీసీ.

అయితే ఈ ఉగాది ఆఫర్ తెలంగాణ ప్రజలు అందరికీ కాదండోయ్.

కేవలం సీనియర్ సిటీజన్స్ కు మాత్రమే.ఏప్రిల్‌​ 2న ఉగాది పండగ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 ఏళ్లకు పైబడిన సీనియర్‌ సిటిజన్స్ అందరూ కూడా ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ఆర్టీసీ ఎండీ అయిన వీసీ సజ్జనార్‌ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

తెలంగాణ పరిధిలోని బస్సుల్లో ప్రయాణించేటపుడు సీనియర్ సిటీజన్స్ తమ దగ్గర ఉన్న ఏదైనా గుర్తింపు కార్డును అంటే 65 ఏళ్లు దాటినట్లు ఉండే ఏదైనా ఒక ధ్రువీకరణ పత్రంను ప్రయాణం చేసే బస్సులోని కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని గమనించి తెలంగాణలోని సీనియర్ సిటిజన్స్ అందరు రేపు ఫ్రీ గా తెలంగాణ బస్సులలో ప్రయాణం చేయవచ్చు.

అంతేకాకుండా తెలంగాణాలోని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సైతం ఒక భారీ ఆఫర్‌ను ప్రకటించింది.అది ఏంటంటే కేవలం 59 రూపాయలతో ‘సూపర్ సేవర్‌ కార్డు’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నట్లుగా ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.ఈ సూపర్ సేవర్‌ కార్డును ఆయనే గురువారం ప్రారంభించారు.ఈ కార్డును.

ఉపయోగించి రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా, ఎన్నిసార్లైనా తిరిగవచ్చట.అయితే, ఈ ఆఫర్ అన్ని రోజుల్లో ఉండదు.

కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మాత్రమే వర్తిస్తుందని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube