బాలీవుడ్ హాట్ హీరోతో రష్మిక మందన్నా.. ఆ సినిమాతో దశ తిరగనుందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

 Rashmika Mandanna Going To Work With Ranbir Kapoor In Sandeep Reddy Vangas Anima-TeluguStop.com

చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇదిలా ఉంటే ఇటీవలే రష్మిక మందన్న పుష్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారి పోయింది.టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే రష్మిక మందన్న తెలుగుతో పాటు బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి మిస్టర్ మజ్ను సినిమా తో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన రష్మిక ప్రస్తుతం ఏకంగా బాలీవుడ్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనుంది.

Telugu National Crush, Puspa, Ranbir Kapoor, Sandeepreddy, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రష్మిక, రణ్ బీర్ కపూర్ కలిసి నటించబోయే సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ సినిమా పేరు యానిమల్. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమాతో భారత సినీ ప్రేక్షకులు అందరూ తన వైపు చూసే విధంగా చేసుకున్నాడు.

ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా రూపొందిన కబీర్ సింగ్ సినిమా కూడా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.కబీర్ సింగ్ సినిమా తరువాత సందీప్ తెరకెక్కుతున్న తర్వాత చిత్రం యానిమల్.

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణితి చోప్రా అని అనుకున్నప్పటికీ, తాజాగా ఓ హీరోయిన్ స్థానం లోకి రష్మిక పేరు వచ్చి చేరింది.కొత్త జంట తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఫ్రెష్ గా ఫీలవుతారని నిర్మాత భూషణ్ కుమార్ తో పాటు దర్శకుడు సందీప్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక కు ఈ సినిమా ప్లస్ అవుతుంది అని వాళ్లు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube