రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 ఒక సినిమాను మించి మరొకటి సంచలన విజయం సాధించాయి.ఈ సినిమాల సక్సెస్ తో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.బాలీవుడ్, కన్నడ దర్శకులు సైతం ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు.బాహుబలి2 కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఇప్పటివరకు బాహుబలి2 సినిమా క్రియేట్ చేసిన రికార్డులను మరే సినిమా బ్రేక్ చేయలేదు.ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.బాహుబలి2 సినిమాతో ప్రభాస్ ఖాతాలో గొప్ప రికార్డ్ చేరిందనే సంగతి తెలిసిందే.ఈ రికార్డ్ ప్రభాస్ అభిమానుల సంతోషానికి కూడా ఒక విధంగా కారణమైంది.అయితే రాధేశ్యామ్ మూవీతో ప్రభాస్ ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది.
ఈ సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు భారీస్థాయిలో నష్టాలను మిగిల్చింది.

204 కోట్ల రూపాయలకు ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ హక్కులు అమ్ముడవగా ఫుల్ రన్ లో ఈ సినిమాకు 83.20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రాధేశ్యామ్ నిలిచింది.
టాలీవుడ్ లో మరే సినిమాకు రాధేశ్యామ్ సినిమాకు వచ్చిన స్థాయిలో నష్టాలు రాలేదనే సంగతి తెలిసిందే.

రాధేశ్యామ్ సినిమా కలెక్షన్ల వల్ల ప్రభాస్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రచారం జరుగుతోంది.రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ ప్రభావం రాధేశ్యామ్ డైరెక్టర్ పై కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.







