టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.వెయ్యి కోట్ల దిశగా ఈ సినిమా దూసుకు పోతున్న నేపథ్యంలో కొందరు ఈ సినిమా వసూళ్ల పై కామెంట్ చేస్తున్నారు.
మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల వసూళ్లు నమోదు చేసిందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఆ విషయం పై కొందరు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇతర చిత్ర నిర్మాతలు మరియు దర్శకుల తరహాలోనే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి కూడా తప్పుడు కలెక్షన్స్ ప్రకటిస్తున్నాడు అంటూ కొందరు పెదవి విరిచారు.
ఆయన ప్రకటించిన ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్లకు సంబంధించి లెక్క సరిపోవడం లేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు రాజమౌళి అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.బాహుబలి 2 సినిమా తో దాదాపుగా రెండు వేల కోట్ల వసూళ్ల ను సొంతం చేసుకున్న రాజమౌళి ఈ సినిమా తో మొదటి మూడు రోజుల్లో 500 కోట్ల వసూళ్లు సాధించాడు అంటే ఏ మాత్రం అనుమానం లేకుండా నమ్మవచ్చు.ఎందుకంటే ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా లను తెరకెక్కించిన గొప్ప దర్శకుడు.
ఆయన బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్ దర్శకులను సైతం వెనక్కి నెట్టిన దర్శక ధీరుడు.అలాంటి దర్శకుడు తెరకెక్కించిన సినిమా మొదటి మూడు రోజుల్లో 500 కోట్లు ఏంటి వెయ్యి కోట్లు వసూలు చేసింది అన్నా కూడా నమ్మవచ్చు.
ఆ స్థాయి అయనది అనడం లో ఎలాంటి సందేహం లేదు.రాజమౌళి సినిమా వసూళ్ల విషయం లో ఎలాంటి డౌట్ అక్కర లేదు అంటూ ఆయన గత సినిమా లకు సంబంధించిన కలెక్షన్స్ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి.
కనుక ఎలాంటి అనుమానం లేకుండా కలెక్షన్స్ వార్తలను నమ్మవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







