NRI లు....ఆధార్ కార్డ్ కావాలంటే..ఇలా చేయండి..!!!

ఆధార్ కార్డ్ భారత దేశంలో ఉండే ప్రతీ ఒక్కరికి ఈ యూనిక్ నెంబర్ ఉండాల్సిందే ఈ కార్డ్ లేని భారతీయులు ఒక్కరు కూడా ఉండరు ఎందుకంటే ప్రభుత్వం నుంచీ వచ్చే ఎలాంటి పధకాలు పొందాలన్నా, తమ పేరు ఎక్కడైనా నమోదు చేసుకోవాలన్నా, ఎలాంటి పనికైనా సరే ఆధార్ తప్పనిసరి.ఈ 12 అంకెల కార్డ్ పైనే ప్రస్తుతం అందరి చిట్టా దాగి ఉంది.

 If Nris Want Aadhaar Card Do This-TeluguStop.com

అయితే ఈ ఆధార్ కార్డ్ దేశం విడిచి పొరుగుదేశాలకు వలసలు వెళ్ళిన ఎన్నారైలకు కూడా ఇస్తారు ఎందుకంటే ఎన్నారైలు భారత్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఇతరత్రా ఎలాంటి కార్యకలాపాలకైనా కొన్ని షరతులతో ఆధార్ కార్డ్ అందిస్తారు.మరి ఎన్నారైలు ఆధార్ కార్డ్ పొందాలంటే.

ఎన్నారైలు గతంలో ఆధార్ కార్డ్ పొందాలంటే తప్పకుండా భారత్ లో సుమారు 182 రోజుల పాటు ఉండాల్సి వచ్చేది.అలా ఉన్న వారికి మాత్రమే ఆధార్ కార్డ్ ఇచ్చేవారు కానీ ఎన్నారైల సేవలను ఉపయోగించుకునే క్రమంలో అలాగే వారి అభ్యర్ధన మేరకు కేంద్రం వారికి వెసులుబాటు ఇచ్చింది.

ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నారైలకు ఆధార్ కార్డ్ జారీ విషయంలో మార్పులు చేసినట్టుగా కీలక ప్రకటన చేశారు.ఈ క్రమంలో ఎన్నారైలు ఎవరైనా భారత్ వచ్చిన వెంటనే ఆధార్ కార్డ్ పొందవచ్చు.

ఎన్నారైలు భారత్ కు వచ్చి ఆధార్ కార్డ్ కోసం అభ్యర్ధించే ముందు వారు ఉంటున్న నివాసం, పుట్టిన తేదీ కి సంభందించి ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది.అలాగే వారి పాస్ పోర్ట్ ఐడీ ప్రూఫ్ ను కూడా వీటితో పాటు జత చేయాలి.అలాగే ఈ వివరాలతో కూడిన ఓ డిక్లరేషన్ కూడా వీటికి జత చేయాలి అంటే తాను జతపరిచిన వన్నీ తనవే నంటూ వ్యక్తిగతంగా ఇచ్చే పత్రం.ఇక ఎన్నారైలు చెప్పిన వివరాలు సరైనవేనా, అవి ప్రభుత్వ ఆమోదం పొందినవేనా అని తెలుసుకునే భాద్యత ఆధార్ సెంటర్ వారిదే.

ఇదిలాఉంటే ఆధార్ కార్డ్ పొందే ఎన్నారై వారి కుటుంబ సభ్యులకు కూడా ఆధార్ కార్డ్ కోసం అభ్యర్ధన పెట్టుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube