టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.పాత్ర కోసం ఎంతైనా కష్టపడే ఈ హీరో సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను సింగిల్ టేక్ లోనే పూర్తి చేస్తారని ఇండస్ట్రీలో పేరుంది.
ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేయడం సులువు కాదని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు.యమదొంగ సినిమా కోసం బరువు తగ్గిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాత్రలకు అనుగుణంగా తన లుక్ ను మార్చుకుంటున్నారు.
సింహాద్రి సినిమా తర్వాత కొన్నేళ్ల పాటు తారక్ నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.వరుస ఫ్లాపులు తారక్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి.
ఆ సమయంలో తారక్ నటించిన రాఖీ సినిమా అబవ్ యావరేజ్ గా నిలిస్తే యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న తారక్ యమదొంగ సక్సెస్ తర్వాత తన కెరీర్ గురించి కామెంట్లు చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియోలో తారక్ మాట్లాడుతూ నా కెరీర్ లో రెండో సినిమా స్టూడెంట్ నంబర్ 1 అని

ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఇంతమంది అభిమానులను వెంటబెట్టుకుని మాట్లాడుతున్నానంటే అది స్టూడెంట్ నంబర్ 1 సినిమా పెట్టిన భిక్షే అని తారక్ అన్నారు.ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలతో తనకు విజయాలు దక్కాయని సింహాద్రి సినిమా కెరీర్ ను ఎంతపైకి తీసుకెళ్లిందో అంతే కిందికి తోసేసిందని తారక్ అన్నారు.మూడేళ్ల పాటు తాను నిరుత్సాహపడటంతో పాటు ఫ్యాన్స్ ను కూడా నిరుత్సాహపరిచానని తారక్ వెల్లడించారు.

ఎన్టీఆర్ కెరీర్ అయిపోయిందంటూ కామెంట్లు వచ్చాయని లక్కీగా స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, ఆది సినిమాలు వచ్చాయని కామెంట్లు చేశారని తారక్ అన్నారు.సక్సెస్ లో ఉంటే ఒకలా లేకపోతే మరోలా కామెంట్లు వస్తాయని తారక్ చెప్పుకొచ్చారు.ఫ్లాప్స్ లో ఉన్న తనకు చిన్న వెలుగు రాఖీ అని ఆ తర్వాత యమగోల సినిమాను మళ్లీ చేస్తున్నామని జక్కన్న తనతో చెప్పి యమదొంగ చేశారని తారక్ వెల్లడించారు.
రాజమౌళి సూచనల మేరకు 4 నెలల్లో బరువు తగ్గానని తారక్ చెప్పుకొచ్చారు.







