ద్విచక్ర అంబులెన్సుల పంపిణీ,రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని మారుమూల గ్రామమైన అప్పాపూర్ ను సందర్శించారు.ఆదివాసీ గూడేల్లో రాజ్భవన్ ప్రారంభించిన పౌష్టికాహార పంపిణీ, సమగ్రాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటనను చేపట్టారు.
రాష్ట్రంలోని ఆదిమ జాతి గిరిజన తెగలు(పీటీజీ) నివసిస్తోన్న కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో నాగర్కర్నూల్ జిల్లాలో ఎంపికైన ఆరు గ్రామాలలో అప్పాపూర్, బౌరాపూర్ కూడా ఉన్నాయి.
అప్పాపూర్ లోని హెల్త్ సబ్ సెంటర్, టైలరింగ్ ట్రెయినింగ్ సెంటర్, శాస్త్రం స్కూల్ ను గవర్నర్ సందర్శించారు.







