ఏపీలో రానున్న 2024 ఎన్నికలకు ఇప్పటినుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలొస్తున్నాయి.మొత్తంగా ఈస్ట్, వెస్ట్ రెండింటిలో ఏది బెస్టో తేల్చేసుకుంటున్నారు.
ఇందుకు తగ్గట్టు తనదైన శైలిలో ముందుకు సాగునున్నారు.ఈనేపథ్యంలో పవన్ దృష్టి ఈస్ట్ గోదావరి జిల్లాపై పడిందని తెలసింది.
ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే 2019 ఎన్నికల్లో పవన్ వెస్ట్ గోదావరి విశాఖల నుంచి రెండు సీట్లను ఎంపిక చేసుకుని పవన్ పోటీకి దిగారు.
వెస్ట్‌లో భీమవరం నుంచి , విశాఖలో గాజువాక నుంచి పోటీ చేస్తే రెడు చోట్ల ఓటమి చవిచూసారు.దీంతో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒకే సీటు నుంచి పోటీకి దిగాలని వవన్ యోచిస్తున్నాడట.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలలో చాలా చోట్ల కాపుల ప్రాభల్యం ఉంది.గతంలో ప్రజారాజ్యం కూడా నాలుగు సీట్లు గెలుచుకుంది.ప్రస్తుతం బలమైన సామాజిక వర్గం జనసేన వైపు ఉందని తెలుస్తోంది.మొత్తంగా ఇక్కడ 19 సీట్లలో ప్రభావం చూపించాలంటే ఇక్కడే పోటీ చేయాలని భావిస్తున్నారట.
దీనిపై పవన్ కూడా అధ్యయనం చేసి రెండు ప్రాంతాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్నాడని సమాచారం.ఇందులో ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీచేయునున్నారని టాక్.రెండు సీట్లలో కాకినాడ రూరల్, ఒకటి.2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కురసాల కన్నబాబు గెలిచారు.జనసేన నుంచి పోటీ చేసిన పంతం నానాజీ ఏకంగా నలభై వేల ఓట్లు తెచ్చుకోవడం విశేషం.ఇక్కడ టీడీపీ తరపున పిల్లి అనంతలక్ష్మి 65వేల ఓట్లు తెచ్చుకుంటే కన్నబాబు 74వేల ఓట్లు తెచ్చుకున్నారు.
ఇక్కడ టీడీపీ, జనసేన పొత్తు ఉంటే వైసీపీ 30వేల ఓట్లతో ఓడుతుందని అంచనా వేస్తున్నారట.అందుకే ఇక్కడి నుంచి పవన్ పోటీకి సిద్ధం అయ్యేందుకు పూనుకున్నాడని తెలిసింది.

మరోవైపు రెండో ఆప్షన్ కింద పిఠాపురంపై దృష్టి పెట్టారట.2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు వైసీపీ తరపున ఇక్కడ గెలుపొందారు.జనసేన తరపున మాకినీడి శేషుకుమారి పోటీ చేయగా 28వేల ఓట్లు వచ్చాయి.ఇక టీడీపీ నుంచి వర్మకు 68వేల ఓట్లు వచ్చాయి.వైసీపికి 83వేల ఓట్లు వచ్చాయి.ఇక్కడా టీడీపీ, జనసేన పొత్తు ఉంటే జనసేనకే సీటు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ రెండు సీట్లపై పవన్ ప్రత్యేక ఫోకస్ పెట్టాడని టాక్.మొత్తంగా ఈస్ట్‌పై పవన్ లుక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.







