బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని ప్రేక్షకులే లేరని చెప్పాలి.ఇక ఈ సీరియల్ తో ప్రేక్షకులకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు బాగా వాలిపోయారు.ఇందులో నటించే కార్తీక్, దీప, సౌందర్య, మోనిత పాత్రలకు బాగా అభిమానులుగా మారారు.
ఇక వీరి గురించి ఏ వార్త వచ్చిన సరే వెంటనే నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.ఇక ఇందులో ఎక్కువగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు విపరిమితమైన ఫాలోయింగ్ ఉంది.
ఈ సీరియల్ తో బుల్లితెర స్టార్ గా మారిన డాక్టర్ బాబు అసలు పేరు అలియాస్ నిరూపమ్. ఇందులో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం అనే మరో సీరియల్ లో నటిస్తున్నాడు.
ఈ సీరియల్ కూడా నిరూపమ్ కు మంచి గుర్తింపు అందిస్తుంది.
ఈయన భార్య బుల్లితెర నటి మంజుల గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆమె కూడా పలు సీరియల్స్ లో బాగా బిజీగా ఉంది.
వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.నిరూపమ్.
కార్తీకదీపం సీరియల్ కంటే ముందు ఎన్నో సీరియల్స్ లో నటించాడు.కానీ ఆయన కెరీర్ కు మలుపు తిరిగిన సీరియల్ అంటే కార్తీకదీపం అనే చెప్పాలి.

ఇక ఆ సీరియల్ తో బుల్లితెర శోభన్ బాబు గా పేరు సంపాదించుకున్నాడు.ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇక ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లో అవకాశాలు కూడా అందుకున్నాడు.పైగా వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు రాగా వదులుకున్నాడు.అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్ లో పాల్గొని బాగా సందడి చేస్తుంటాడు.
ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.
తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని విషయాలను బాగా షేర్ చేసుకుంటాడు.సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పైగా ఇటీవలే తన పేరు తన భార్య పేరుతో కలిపి ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చేసాడు.

అందులో తమకు సంబంధించిన ఎన్నో వీడియోలు పంచుకున్నాడు.ఏ వస్తువు కొన్నా వాటిని వీడియో చేసి చూపిస్తారు.ఇక తాజాగా మరో వీడియో షేర్ చేసుకున్నారు.
అందులో తమ ఫ్యామిలీ గోవా కి వెళ్లినట్లు కనిపించగా.బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించారు.
బీచ్ దగ్గరికి వెళ్లి బాగా సందడి చేశారు.
ఇక షాపింగ్ అని చేయగా.
అక్కడ డాక్టర్ బాబు తన భార్యతో పాటు బాగా బేరాలు చేశాడు.మధ్యమధ్యలో బాగా పంచ్ లు కూడా వేసాడు.
ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.అంతే కాకుండా బాగా లైక్స్ తో పాటు కామెంట్స్ కూడా వస్తున్నాయి.
కార్తీకదీపంలో ఆయన పాత్ర ముగియడంతో ఇక్కడ సీరియల్స్ లేకపోవడంతో అక్కడ బేరాలు ఆడుతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.







