ఈ మధ్యకాలంలో విడుదల అయ్యే తెలుగు సినిమాలకు యు.ఎస్ మార్కెట్ ప్రధాన బలం గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.
అయితే దేశ వ్యాప్తంగా సాధించే వసూళ్లతో పాటుగా యూఎస్ లో లభించే వసూళ్లను ప్రత్యేకంగా చూస్తున్నారు.తెలుగులో ఇప్పటికే చాలామంది పెద్ద హీరోలకు యూఎస్ లో భారీగా క్రేజ్ ఏర్పడింది.
టాలీవుడ్ లోని స్టార్ హీరోల సినిమాలు ప్రీమియర్ లతో యూఎస్ఏ లో దాదాపుగా వన్ మిలియన్ మార్కును అవలీలగా దాటేస్తున్నాయి.మరి ఇప్పటి వరకు యూఎస్ మార్కెట్ లో అత్యధికంగా ప్రీమియర్ షోల ద్వారా భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాల గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా యు.ఎస్.లో విడుదలకు ముందే ప్రీమియర్ ద్వారా దాదాపుగా మూడు మిలియన్లు సొంతం చేసుకుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన బాహుబలి సినిమాను ఈ సినిమా క్రాస్ చేసి మొదటి స్థానంలో నిలిచింది.రెండవ స్థానంలో ప్రభాస్ నటించిన బాహుబలి ది కన్క్లూజన్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద రెండు మిలియన్ల డాలర్లను రాబట్టి రెండో స్థానంలో నిలిచింది.
ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా అప్పట్లో ఈ సినిమా రికార్డును సాధించింది.తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ ఈ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్స్ ద్వారా 1.51 మిలియన్ డాలర్లు వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.ఆ తర్వాత బాహుబలి పార్ట్ వన్ ఈ మెసేజ్ ద్వారా 1.36 మిలియన్ డాలర్లను రాబట్టింది.ఆ తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా యూఎస్ లో ప్రీమియర్ ద్వారా 1.29 మిలియన్ డాలర్లను దక్కించుకుంది.

మహేష్ నటించిన స్పైడర్ సినిమా 1.28 డాలర్లను దక్కించుకుంది.ఆ తర్వాత ఏడవ స్థానంలో రాధే శ్యామ్ సినిమా 904 డాలర్లను , ఆ తర్వాత స్థానంలో భరత్ అనే నేను 850 డాలర్లను , ఆపై సాహో సినిమా 850 డాలర్లను సాధించాయి.పదవ స్థానంలో సైరా నరసింహారెడ్డి 815 డాలర్లను సాధించి పదవ స్థానంలో నిలిచింది.







