టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గానే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభావం మరింత పెంచే విధంగా, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసే విషయంపై దృష్టి పెట్టారు.
దీనిలో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు కేసీఆర్ పాటిస్తూ వస్తున్నారు.మూడోసారి తెలంగాణలో టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు రావడం ఆషామాషీ వ్యవహారం కాదనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే పీకే సలహాలను ఎన్నోకేసిఆర్ అమలు చేశారు .అలాగే రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి ? ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏవిధంగా ఉంది ? ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే తప్పకుండా గెలుస్తారు ? రాజకీయ ప్రత్యర్థుల బలాలు , బలహీనతలు ఏమిటి ఇలా అనేక అంశాలను ప్రశాంత్ కిషోర్ టీమ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే పీకే టీం అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు నిర్వహించింది. ఈ సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని క్షేత్రస్థాయిలో వారిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, కిందిస్థాయి క్యాడర్ సరిగా పట్టించు కోవడం లేదని, ప్రజలకు అందు బాటులో ఉండడం లేదని రిపోర్ట్ అందిందట.
పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేల కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కేసీఆర్ సంకేతాలు పంపిస్తూ ఉండడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగి పోతోందట.

దీంతో పీకే టీం సర్వే రిపోర్ట్ తమకు వ్యతిరేకంగా వచ్చిందా ? అనుకూలంగా వచ్చిందా అనే విషయాలపై టిఆర్ఎస్ నాయకుల ద్వారా ఎమ్మెల్యేలు ఆరా తీసే పనిలో ఉన్నారట.కేవలం ఈ సర్వే మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని సర్వేలు నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరుని అంచనా వేయబోతూ ఉండడంతో పికే టెన్షన్ మరింతగా పెరిగిపోతోందట.







