ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి బయట పెట్టారు.
ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిట్ నెస్ కావాలంటే కేవలం జిమ్ కిపెళ్లి వ్యాయామాలు చేస్తే సరిపోదని అందుకు తగ్గ ఆహారం కూడా తీసుకోవాలంటూ ఈమె వెల్లడించారు.అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆలోచనలను అలవాటు చేసుకోవడం వల్ల మన శరీరంలో ఎంతో మార్పు కనిపిస్తుందని శ్రీవల్లి ఫిట్ నెస్ గురించి వెల్లడించారు.

ఈ విధంగా ఫిట్ నెస్ కోసం ఈ విధమైనటువంటి జిమ్, ఆహార నియంత్రణ మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా అలవాటు అయితే మనలో ఎన్నో మార్పులు కనిపిస్తాయని ఈ సందర్భంగా ఫిట్ నెస్ సీక్రెట్ గురించి వెల్లడించారు.మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్న కూడా స్థిరంగా ప్రయత్నాలు చేయడం ఎంతో ముఖ్యమని రష్మిక ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక పుష్ప సినిమాతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానుంది.అలాగే పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్లో కూడా రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.







