తెలంగాణ సీఎం , టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.ఒకవైపు రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూనే, మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు , రాబోయే రోజుల్లో కీలకంగా మారేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా బిజెపి అధికారంలోకి రాకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ మేరకు ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారు కాబోతోంది.
హైదరాబాద్ లేక మరో కీలక ప్రాంతంలోనూ బీజేపీయేతర ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించాలని కెసిఆర్ ప్లాన్ చేసుకున్నారు.వచ్చే నెల రెండవ వారం నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు మళ్లీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, దాని కంటే ముందుగానే బీజేపీయేతర ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించాలని కెసిఆర్ వ్యూహమట.
ఈ పర్యటనలోనే వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడంతో పాటు , వివిధ రంగాల్లో నిపుణులైన వారిని కలిసి వారి సలహాలు సూచనలు తీసుకోవాలని, అలాగే మాజీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతోనూ విదేశాంగ వ్యవహారాలలో అనుభవం ఉన్న వారితోనూ కీలక సమావేశాన్ని నిర్వహించాలని ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీ పర్యటనలో ని తన ప్రభావం మరింతగా పెంచుకుని , రాబోయే ఎన్నికల్లో గట్టెక్కేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేసేందుకు కేసీఆర్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వెలువడిన సాధారణ ఎన్నికల నాటికి ప్రజలు బిజెపి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని, అది తమకు కలిసి వస్తుందని కేసీఆర్ తో పాటు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు చాలామంది అభిప్రాయపడుతుండడంతోనే కెసిఆర్ సమావేశానికి ఇంతగా ప్రాధాన్యం ఏర్పడింది.







