ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోగా మారినప్పటికీ ఈయన ఎంతో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.
స్టార్ హీరో అన్న అహం ఏ మాత్రం లేకుండా అభిమానుల మధ్య తిరగడానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న హోటల్స్ లో తినడానికి కూడా అల్లుఅర్జున్ ఏమాత్రం వెనకాడరని ఇదివరకే నిరూపించుకున్నారు.

అల్లు అర్జున్ కేవలం అభిమానుల విషయంలోనే కాకుండా తన దగ్గర పని చేసే సిబ్బందితో కూడా ఎంతో చనువుగా ఉంటారు.ఈ క్రమంలోనే వారిని తన సొంత మనుషులుగా అల్లుఅర్జున్ భావిస్తారు.ఇక ఏ స్టార్ హీరో కూడా తన దగ్గర పనిచేసే వారి ఇంటికి వెళ్లడం వారి ఫంక్షన్లకు వెళ్లాలంటే కాస్త ఆలోచిస్తారు.
కానీ ఇలాంటి విషయాలలో బన్నీ ఏ మాత్రం ఆలోచించకుండా తన దగ్గర పనిచేసే వారికి సంబంధించిన వేడుకలకు వెళ్తూ వారిని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు.ఇప్పటికే ఇలా ఎంతోమంది పెళ్లిళ్లకు వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అల్లుఅర్జున్ తాజాగా మరో వివాహానికి హాజరయ్యారు.

అల్లు అర్జున్ తన మేనేజర్ మనోజ్ వివాహం చేసుకున్నారు.మనోజ్ తన వివాహానికి అల్లు అర్జున్ ని ఆహ్వానించారు.అయితే అల్లుఅర్జున్ వస్తున్నట్టు ఎలాంటి సమాచారం లేదు కానీ అల్లు అర్జున్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఈ పెళ్ళికి హాజరై అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు.మేనేజర్ మనోజ్ పెళ్లికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే వారితో కలిసి ఫోటోలు దిగారు.ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే వచ్చే నెల నుంచి బన్నీ పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీ కానున్నారు.







